Page Loader
Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు!
ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం

Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు!

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2025
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

వేసవి కాలం అంటే మామిడి పండ్ల కాలం. ఎటు చూసినా మామిడిపండ్ల మధుర సువాసన తేలిపోతూ ఉంటుంది. ఈ మామిడి పండ్ల ప్రత్యేకత ఏమిటంటే, కేవలం నేరుగా తినడమే కాకుండా, వీటితో ఎన్నో రుచికరమైన వంటకాలను సిద్ధం చేయవచ్చు. తాజాగా, భారతదేశంలో తయారయ్యే ఒక మామిడి వంటకం ప్రపంచ స్థాయిలో అత్యుత్తమంగా గుర్తింపు పొందింది. ఆహార, ప్రయాణ విషయాల్లో ప్రఖ్యాతంగా ఉన్న ఆన్‌లైన్ గైడ్ టేస్ట్ అట్లాస్ (TasteAtlas) తాజాగా విడుదల చేసిన జాబితాలో, వేసవి కాలంలో భారతదేశంలో ప్రత్యేకంగా తయారయ్యే "ఆమ్రస్" అనే వంటకానికి మామిడి వంటకాల్లో మొదటి స్థానం లభించింది. ఈ విషయం భారతీయ ఆహార సంప్రదాయ వైవిధ్యాన్ని, రుచుల గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేస్తోంది.

వివరాలు 

మామిడికాయలతో వేసవిలో ఎక్కువగా తయారయ్యే సాంప్రదాయ వంటకం

టేస్ట్ అట్లాస్ రూపొందించిన ప్రపంచంలో అత్యుత్తమ 20 మామిడి వంటకాల జాబితాలో "ఆమ్రస్" అగ్రస్థానంలో నిలవడమే కాక, ఇంకొక భారతీయ వంటకం "మామిడికాయ పచ్చడి" కూడా ఐదవ స్థానం దక్కించుకుంది. ఇది మామిడికాయలతో వేసవిలో ఎక్కువగా తయారయ్యే సాంప్రదాయ వంటకం. మరి ఆ జాబితాలోని మిగిలిన మామిడి వంటకాలు ఏమిటి? ఆమ్రస్, మామిడి చట్నీ విశేషతలు ఏంటి? టేస్ట్ అట్లాస్ ప్రకారం - ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలు: ఆమ్రస్ - భారతదేశం మ్యాంగో స్టిక్కీ రైస్ - థాయ్‌లాండ్ సోర్బెట్స్ - ఫిలిప్పీన్స్ రుజాక్ - జావా, ఇండోనేషియా మామిడి చట్నీ - మహారాష్ట్ర, భారతదేశం

వివరాలు 

ఆమ్రస్ ఎందుకు అగ్రస్థానంలో ఉందంటే: 

ఆమ్రస్ అనేది ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో వేసవికాలంలో తయారయ్యే మామిడి పండ్లపై ఆధారపడ్డ రుచికరమైన స్వీట్ వంటకం. దీనికి పూర్తిగా పండిన మామిడి పండ్ల గుజ్జుతో ప్యూరీ తయారు చేస్తారు. సహజంగా వచ్చే పరిమళం, తీపి రుచి దీనికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. ఇందులో ఏలకుల పొడి, కుంకుమపువ్వు వంటి పదార్థాలను కలపడం ద్వారా దీని రుచి మరింత అద్భుతంగా మారుతుంది. 5వ స్థానంలో కూడా భారతదేశమే.. ఈ వంటకం వేసవిలో దాదాపుగా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో తయారవుతుంది. ఇది మామిడికాయ,మసాలాలు,చక్కెర వంటి పదార్థాలతో తయారవుతుంది.ఇందులో అల్లం, వెల్లుల్లి, మిరపకాయలు, జీలకర్ర వంటి దినుసులు కలుపుతారు. తియ్యతియ్యగా, కారంగా ఉండే ఈ వంటకం వాసనతో పాటు రుచి కూడా అద్భుతంగా ఉంటుంది.

వివరాలు 

ఆమ్రస్ ఎలా తయారు చేస్తారు? 

కావలసిన పదార్థాలు: బాగా పండిన మామిడి పండ్లు చక్కెర - రుచికి అనుగుణంగా ఏలకుల పొడి - చిటికెడు (ఐచ్ఛికం) కుంకుమపువ్వు - కొన్ని దారాలు (ఐచ్ఛికం) పాలు లేదా నీరు - అవసరానికి తగినంత తయారీ విధానం: మామిడి పండ్లను శుభ్రంగా కడిగి తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. ఈ ముక్కలను మిక్సీ జార్‌లో వేసి, వాటితో పాటు చక్కెర, ఏలకుల పొడి కలపాలి. బాగా మెత్తగా ప్యూరీలా అయ్యే వరకు బ్లెండ్ చేయాలి. చిక్కదనాన్ని బట్టి కొద్దిగా పాలు లేదా నీరు కలపవచ్చు. ముందుగా వేడి పాలల్లో నానబెట్టిన కుంకుమపువ్వు దారాలను ఈ మిశ్రమంలో కలపాలి.

వివరాలు 

చల్లగా సర్వ్ చేసుకోవచ్చు

ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఒక గంట పాటు ఉంచిన తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. ఇలా తయారైన ఆమ్రస్‌ - ప్రపంచంలోనే అగ్రస్థానం పొందిన భారతీయ మామిడి వంటకం - మీ ఇంట్లోనూ తీయటానికి ఎంతో సులభమైనది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వేసవి సీజన్‌ ముగిసేలోపు మీరు కూడా ఈ అద్భుతమైన మామిడి వంటకాన్ని ఒకసారి తప్పకుండా ఆస్వాదించండి.