Loading...
Project Cheetah: ప్రాజెక్ట్ చీతాలో మరో కీలక మైలురాయి.. నాలుగు కూనలకు జన్మనిచ్చిన బోట్స్వానా చీతా
నాలుగు కూనలకు జన్మనిచ్చిన బోట్స్వానా చీతా

Project Cheetah: ప్రాజెక్ట్ చీతాలో మరో కీలక మైలురాయి.. నాలుగు కూనలకు జన్మనిచ్చిన బోట్స్వానా చీతా

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 20, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో చిరుతల సంతతి క్రమంగా పెరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు చీతా (Project Cheetah)లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బోట్స్వానా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన రెండున్నరేళ్ల ఆడ చిరుత 'కోఎమ్‌జి 3' అడవిలో నాలుగు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. బోట్స్వానా నుంచి భారత్‌కు తీసుకొచ్చిన చిరుతల్లో పిల్లలకు జన్మనిచ్చిన తొలి ఆడ చిరుతగా కోఎమ్‌జి 3 నిలిచిందని కేంద్ర మంత్రి తెలిపారు. ప్రాజెక్టు చీతా ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా అభివర్ణించారు. నాలుగు నెలలకు పైగా అడవిలో సహజ వాతావరణంలో స్వేచ్ఛగా గడిపిన తర్వాత ఈ చిరుత కూనలకు జన్మనిచ్చిందని పేర్కొన్నారు.

వివరాలు 

62కు చేరిన చిరుతల సంఖ్య

తాజాగా జన్మించిన నాలుగు కూనలతో కలిపి దేశంలో చిరుతల సంఖ్య 62కు చేరిందని భూపేందర్ యాదవ్ వెల్లడించారు.

వీటిలో భారత్‌లోనే జన్మించిన చిరుతలు 43 ఉండటం విశేషం.

దేశంలో అంతరించిపోయిన చిరుతల సంతతిని తిరిగి అభివృద్ధి చేయడంతోపాటు వాటి సంఖ్యను పెంచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు చీతాను ప్రారంభించింది.

ఈ ప్రాజెక్టు ద్వారా భారత్‌లో చిరుతల పునరుత్పత్తి కొనసాగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నాలుగు కూనలకు జన్మనిచ్చిన బోట్స్వానా నుంచి వచ్చిన చిరుత

ADVERTISEMENT