
Ratan Tata Best Quotes: భవిష్యత్ తరాలకు మార్గనిర్దేశం,స్ఫూర్తినిచ్చే.. రతన్ టాటా.. రతనాల మాటలు
ఈ వార్తాకథనం ఏంటి
బిజినెస్ టైకూన్, టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా (86) కన్నుమూశారు.
ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11:30 గంటలకు తుదిశ్వాస విడిచారు.
ఈ సమయంలో యావత్ భారతదేశం ఘన నివాళులర్పిస్తోంది. రతన్ టాటా పలు సందర్భాల్లో జీవితాలను మార్చేసే స్పూర్తిదాయకమైన ప్రసంగాలను అందరూ గుర్తుచేసుకుంటారు.
వివరాలు
రతన్ టాటా మాట.. రతనాల మూట
'జీవితంలో విజయం సాధించాలంటే ఒడిదొడుకులు ఉండటం చాలా ముఖ్యం. ఈ సీజీలో సరళ రేఖ ఉన్నదంటే ప్రాణం లేదనే అర్థం.'
కేవలం భౌతిక విషయాలతోనే జీవితం ముడిపడిందని ప్రతి ఒక్కరు ఎప్పుడో ఒకసారి గ్రహిస్తారు. మనం ప్రేమించే వారిని ఆనందంగా ఉంచడంలోనే మన సంతోషం ఉంది.
తన కోసం పని చేస్తున్న వారి మేలు కోరే వాడే ఉత్తమ నాయకుడు.
వృత్తిని - జీవితాన్ని సమతులం చేయడంపై నాకు నమ్మకంలేదు. వృత్తిని - జీవితాన్ని మమేకం చేయాలి. మీ వృత్తిని, జీవితాన్ని అర్ధవంతంగా తీర్చిదిద్దుకోవాలి.
ఏ ఇబ్బందినీ స్వీకరించకపోవడమే పెద్ద ప్రమాదం. అతి వేగంగా మారుతున్న ఈ ప్రపంచంలో ఏ సవాల్‌ని స్వీకరించ లేకపోతే అపజయం తప్పదు.