NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం!
    అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం!

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 21, 2025
    11:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జీవితం అనేది నెమ్మదిగా సాగే ప్రయాణం కాదు. ఇందులో ఎన్నో ఎత్తులు, పడిల్లు సహజం. మీరు పైకి రావాలని తపించే వాళ్లకంటే, మీరు కింద పడితే చూడాలని ఆశించే వాళ్లే ఎక్కువగా ఎదురవుతారు.

    ముఖాముఖిగా మంచి మాటలు చెప్పే వారే, మీ ఎదుగుదల చూసి అసహనం చెందిన వారు కావడం తరచూ జరుగుతుంది. ఇది విన్నప్పుడు బాధ కలిగించవచ్చు,

    కానీ ఇదే చేదు నిజం. జీవన ప్రయాణంలో మీరు ఎంతోమంది వ్యక్తులను కలుస్తారు - కొందరు మీకు స్ఫూర్తిని ఇస్తారు, మార్గదర్శకులవుతారు.

    మరికొందరు మాత్రం మీ మంచితనాన్ని తన ప్రయోజనాల కోసం వాడుకుంటారు. మనుషులు స్థిరంగా ఉండరు, వారు మారతారు.

    Details

    మనం

    కొన్ని సందర్భాల్లో మీరు అత్యంత నమ్మకంగా భావించినవారే మిమ్మల్ని ద్రోహిస్తారు. మీరు చేసిన సాయం, కనబరిచిన ప్రేమ అంతా వారి దృష్టిలో బలహీనతగా మారిపోతుంది.

    పరిస్థితులు తిరగబడినప్పుడు వారి అసలైన రూపం మీ ముందుకు వస్తుంది.

    మీ అవసరాలు తీరిన వెంటనే వారు మిమ్మల్ని వదిలిపెట్టి, మీను తప్పుబట్టే దాకా వెళతారు.

    అప్పటివరకు మీరు చేసిన మేలంతా విస్మరిస్తారు. నిందలు, అవమానాలు మిమ్మల్ని చుట్టుముట్టుతాయి. మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు.

    Details

    మీపై నిందలు వేస్తే మీలో గుణాలు తగ్గిపోవు

    అయితే ఇది మర్చిపోకండి — ఎవరైనా ఎంతటి ప్రయత్నం చేసినా, మీ విలువను తగ్గించలేరు.

    మీరు ఎవరూ, మీ వ్యక్తిత్వం ఎంత గొప్పదో మీకూ తెలుసు, మీను నిజంగా గుర్తించాల్సిన వారికి కూడా తెలుసు. మీపై నిందలు వేస్తే మీలో గుణాలు తగ్గిపోవు.

    అవమానాల వలయం తాత్కాలికంగా మీ జీవితాన్ని చీకటి వైపు నెట్టవచ్చు, కానీ నిజమైన వెలుగు మిమ్మల్ని చేరుకుంటుంది. మీరు అధిగమించాల్సిన శిఖరాన్ని ఎవరూ ఆపలేరు.

    Deteails

    ఈ కథను తెలుసుకోండి

    ఒకసారి పెద్ద హాలులో వేలాది మంది కూర్చున్నారు.

    ప్రపంచానికి పేరు గాంచిన ఓ ప్రతిష్టాత్మక వ్యక్తి ప్రసంగించబోతున్నాడు. కాసేపటికి వేదికపైకి వచ్చిన ఆ వ్యక్తి, "మీరు శ్రద్ధంగా వింటే, మీ జీవితమే మారిపోతుందన్నారు.

    వెంటనే తన జేబులోంచి ఒక మేలిమి బంగారు నాణెం తీసి, "ఈ నాణెం ఎవరికైనా కావాలా?" అని అడిగారు.

    అందరూ చేతులు పైకెత్తారు. "ఈ నాణెం ఇస్తాను కానీ కొంచెం వెయిట్ చేయాలి," అన్నారు. తరువాత ఆ నాణెన్ని నేలకేసి గట్టిగా రుద్దారు. అది కొంచెం పాతదిగా కనిపించటం మొదలైంది.

    మళ్లీ "ఇప్పుడు ఎవరికైనా కావాలా?" అని అడిగారు. ఈసారి కూడా అందరూ చేతులు పైకెత్తారు.

    Details

    బంగారం విలువ తగ్గదు

    తరువాత ఆ నాణెన్ని మడిచి వంకరగా చేసి, కాళ్లతో తొక్కి మురికి పట్టించారు. మళ్లీ "ఇప్పుడు ఎవరికైనా కావాలా?" అని అడిగారు.

    మళ్లీ అందరూ చేతులు పైకెత్తారు. అప్పుడు ఆ వ్యక్తి చెప్పిన మాటలు ఇలా ఉన్నాయి: "ఈ బంగారు నాణెం నేలకేసి పడేసినా, తొక్కినా మురికి పడ్డా దీని విలువ తగ్గలేదు.

    ఇదే మీకు చెప్పదలచిన సందేశం - మీరు ఎంత కష్టాల్లో ఉన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా, ఎంత తొక్కినా మీరు విలువలేని వారు కాలేరు. మీరు మేలిమి బంగారం లాంటి వారే."

    Details

    పరాజయాలు మీ విలువను నిర్ధారించవు

    జీవితం కొన్నిసార్లు అనూహ్యంగా దెబ్బలు తగిలిస్తుంది. పరీక్షల్లో, ఉద్యోగాల్లో, బంధాలలో, ప్రేమలో, జీవితానంతర సంబంధాల్లో మీరు విఫలమవవచ్చు.

    కానీ ఈ పరాజయాలు మీ విలువను నిర్ధారించవు. మీరు ఎవరో, మీ సత్తా ఎంతదో తెలుసుకునే సమయం వస్తుంది. మీరు బ్రతికే సమయంలో కొన్ని దారుణమైన క్షణాలు ఎదురవుతాయి.

    ఆ సమయంలో మీరు మీను తక్కువగా భావిస్తారు, మీరు ఏదికీ అర్హులు కాదని అనుకుంటారు. ఇతరులు గొప్పవారిలా అనిపిస్తారు. కానీ గుర్తుంచుకోండి — దశలు మారుతాయి, దినాలు మారతాయి.

    మీ సమయం వస్తుంది. అప్పుడే మీ విలువ తెలుసుకుంటారు. మీరు మిగతావారి కన్నా తక్కువవారు కాదని, అసలైన గొప్పతనం మీలోనే ఉందని ప్రపంచం అర్థం చేసుకుంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీవితం

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    జీవితం

    ప్రేరణ: రూపం లేని రేపటి గురించి ఆలోచించడం కన్నా నీ రూపం ఉన్న ఈరోజు గురించి ఆలోచించు  ప్రేరణ
    ప్రేరణ: లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువ సమయం పడుతుందని లక్ష్యాన్ని వదులుకోవడం పిచ్చితనం  ప్రేరణ
    ప్రేరణ: నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు హ్యాపీగా ఉండాలంటే నీలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటో తెలుసా?  ప్రేరణ
    ప్రేరణ: నువ్వు గొప్ప స్నేహితుడైతేనే నీకు గొప్ప స్నేహితులు దొరుకుతారు  ప్రేరణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025