
అంతర్జాతీయ బాలికల దినోత్సవం: చరిత్ర, తెలుసుకోవాల్సిన విషయాల, కొటేషన్లు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ ఏడాది అక్టోబర్ 11వ తేదీన అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటారు.
బాలికల హక్కుల గురించి అవగాహన కలిగించడానికి, బాలికలు ఎదుర్కొంటున్న సవాళ్లను తెలియజేయడానికి ప్రతీ ఏడాది అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటున్నారు.
ముఖ్యంగా ఏ విషయంలోనైనా ఆడ, మగ తేడా అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజును జరుపుతున్నారు.
2012 సంవత్సరం నుండి అంతర్జాతీయ బాలికల దినోత్సవం జరుపుకోవడం మొదలుపెట్టారు.
మొట్టమొదటి అంతర్జాతీయ బాలికల దినోత్సవం బాల్యవివాహాలను రూపుమాపాలనే థీమ్ తో జరిపారు.
చరిత్ర:
1995 ప్రపంచ మహిళా సమావేశంలో బాలికల హక్కుల గురించి మొదటిసారిగా మాట్లాడారు.
ఆ తర్వాత ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని అక్టోబర్ 11వ తేదీన జరపాలని నిర్ణయించింది.
Details
అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున పంచుకోవాల్సిన కొటేషన్లు
సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటు వాళ్ళకు ఎదురవుతున్న సవాళ్లను తొలగించే విధంగా కృషి చేయాలని అంతర్జాతీయ బాలికల దినోత్సవం రోజున అనేక కార్యక్రమాలను జరుపుతారు.
అంతర్జాతీయ బాలికల దినోత్సవం కొటేషన్లు:
ఎవరైతే గుంపుతో ఆలోచిస్తారో వాళ్ళు గుంపును దాటి బయటకు వెళ్ళలేరు. ఆ గుంపును దాటి ఒంటరిగా అడుగు పెట్టిన వాళ్ళు శిఖరాన్ని అందుకుంటారు - ఆల్బర్ట్ ఐన్ స్టెయిన్
చాలామంది నిన్ను చులకనగా చూడాలని అనుకుంటారు, కానీ నువ్వు మాత్రం నీ పని చేసుకుంటూ వెళుతూ ఉండు. అప్పుడే నీ బలం అవతల వారికి అర్థమవుతుంది - అబిగలి బ్రెస్లిన్