
ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే: ముద్దు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రేమను రకరకాలుగా ప్రకటించవచ్చు. అలా ప్రకటించే విధానాల్లో ముద్దు పెట్టుకోవడం కూడా ఒకటి. ఈరోజు ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే.
ఈ సందర్భంగా ముద్దు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో తెలుసుకుందాం.
హ్యాపీ హర్మోన్స్ ని పెంచే ముద్దు:
మీ భాగస్వామిని ముద్దు పెట్టుకున్నప్పుడు మీ మెదడులో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. ఆక్సిటోసిన్, సెరెటోనిన్, డోపమైన వంటి హార్మోన్ల కారణంగా మీకు సంతోషం ఎక్కువవుతుంది.
బీపీని తగ్గించే ముద్దు:
ముద్దు పెట్టుకోవడం వల్ల మీ గుండె వేగం పెరుగుతుంది. దానివల్ల రక్తనాళాలు విశాలంగా మారతాయి. రక్తప్రసరణకు ఎలాంటి అడ్డంకి ఏర్పడకుండా ఉండటం వల్ల బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది.
Details
కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గించే ముద్దు
ఒత్తిడి, యాంగ్జాయిటీ దూరమవుతాయి:
ముద్దు పెట్టుకోవడం, కౌగిలింత అనేవి మీలోని ఒత్తిడిని, యాంగ్జాయిటీని తగ్గిస్తాయి. ముద్దుపెట్టుకోవడం వల్ల ఒత్తిడికి కారణమయ్యే కార్టిసాల్ హార్మోన్ ఉత్పత్తి తగ్గుతుంది. లవ్ హార్మోన్ గా పిలబడే ఆక్సిటోసిన్ విడుదలై యాంగ్జాయిటీ దూరమవుతుంది.
బంధాన్ని బలపరుస్తుంది:
మీ భాగస్వామితో మీ బంధం బలపడాలంటే ముద్దులు ఖచ్చితంగా ఉండాలి. ముందుగా చెప్పినట్టు ముద్దు పెట్టుకునే టైమ్ లో రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ కారణంగా అవతలి వారిపై ఆకర్షణ బాగా పెరుగుతుంది.
చర్మానికి మెరిసే గుణాన్ని అందిస్తుంది:
ముద్దు పెట్టుకోవడం వల్ల ముఖం మీద కండరాలు యాక్టివేట్ అవుతాయి. ముఖ భాగంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. ఈ కారణంగా చర్మానికి మెరిసే గుణం వస్తుంది.