Page Loader
International Nurses Day 2023; నర్సులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి 
నర్సులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి

International Nurses Day 2023; నర్సులు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి 

వ్రాసిన వారు Stalin
May 12, 2023
04:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైద్య విభాగంలో నర్సుల సేవలను గుర్తించేందుకు ప్రతి సంవత్సరం మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర అమోఘమైనది. ఇతరుల ఆరోగ్యం బాగుపడేందుకు నర్సులు తమ జీవితాలను అంకితం చేస్తారు. ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ (ఐసీఎన్) అనేది ప్రపంచవ్యాప్తంగా 28మిలియన్ నర్సులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 130కంటే ఎక్కువ జాతీయ సంఘాల సమాఖ్య. ఐసీఎన్ 1899లో స్థాపించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి విశాలమైన ఆరోగ్య సంరక్షణ నిపుణుల అంతర్జాతీయ సంస్థ.

నర్సులు

ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలకు గుర్తుగా 

ఫ్లోరెన్స్ నైటింగేల్ మే 12, 1820న ఇటలీలో జన్మించారు. ఆమె 1850 లలో క్రిమియన్ యుద్ధం సమయంలో చాలా పాపులర్ అయ్యారు. ఆమె తన బృందంతో కలిసి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేశారు. నైటింగేల్ సానిటరీ పరిస్థితులను మెరుగుపరచడానికి చాలా ప్రయత్నాలు చేశారు. నైటింగేల్ నర్సింగ్ పద్ధతుల వల్ల మరణాల రేటును గణనీయంగా తగ్గింది. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలిగా చెప్పుకునే ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ మే 12ని అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. రోగుల భద్రత, ఆరోగ్యం, వారు కోలుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న నర్సుల సేవలను ఈ రోజున గుర్తు చేసుకుంటారు.