Filter coffee : ఫిల్టర్ కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు.. తాగితే ఫిల్టర్ కాఫీనే!
సౌత్ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఇప్పుడు మరోసారి ప్రపంచ స్థాయిలో ప్రశంసలు పొందింది. టేస్ట్ అట్లాస్ విడుదల చేసిన ప్రపంచంలోని టాప్ 10 కాఫీల జాబితాలో, ఈ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇది దక్షిణ భారతదేశంలో ప్రత్యేకమైన రుచి, ప్రత్యేకమైన తయారీ విధానానికి ప్రసిద్ధి చెందింది. ఈ జాబితాలో మొదటి స్థానం క్యూబా ఎస్‌ప్రెస్సోకి దక్కడం గమనార్హం. కాఫీ సేవించే విధానం ఈ కాఫీని పాలు, చక్కెరతో కలిపి తాగుతారు. దీనిని సాధారణంగా చిన్న స్టీల్ గ్లాసులో సర్వ్ చేస్తారు. సాసర్‌లో కాఫీని పోసుకుని దాన్ని సిప్ చేస్తుంటే ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది.
సాంప్రదాయ తయారీ విధానం
దక్షిణ భారత ఫిల్టర్ కాఫీను తయారు చేయడం కోసం ఉపయోగించే సాంప్రదాయ పద్ధతిలో స్టెయిన్లెస్ స్టీల్ ఫిల్టర్ యంత్రం ఉంది. ఇది రెండు భాగాలతో తయారవుతుంది. పైన కాఫీ పౌడర్ ఉండగా, అందులో వేడి నీళ్లు పోసినప్పుడు కాఫీకింద ఉన్న భాగంలో కాచించి సేకరిస్తుంది. కాఫీ నెమ్మదిగా దిగువకు జారుతుంటే ఆ సువాసనలు అమోఘంగా ఉంటాయి. చాలామంది కాఫీని రాత్రి ఫిల్టర్‌ను చేసి, ఉదయం వేడి వేడి కాఫీతో రోజును ప్రారంభిస్తారు. గత ర్యాంకింగ్స్ ఈ ఏడాది మార్చ్‌లో విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో కూడా ఫిల్టర్ కాఫీ రెండో స్థానాన్ని పొందింది. త్వరలోనే సౌత్ ఇండియాలోని ఫిల్టర్ కాఫీకి నంబర్ 1 ర్యాంక్ వస్తే, ఇది మరింత గర్వకారణం అవుతుంది.
అంతర్జాతీయ గుర్తింపు
సౌత్ ఇండియా ఫిల్టర్ కాఫీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు దక్కడం కాఫీ ప్రేమికులకు గర్వకారణంగా ఉంది. గ్రీస్‌లోని ఎస్‌ప్రెస్సో ఫ్రెడో, ఇటాలియన్ కాపచీనో, టర్కిష్ కాఫీ వంటి ప్రముఖ పానీయాలను వెనక్కి నెట్టి, ఈ ఫిల్టర్ కాఫీ రెండో స్థానంలో నిలవడం నిజంగా గొప్ప విషయం. ఆరోగ్య సూచనలు నిపుణులు రోజుకు 400 మిల్లీగ్రాముల కెఫైన్ తీసుకోవచ్చని సూచిస్తున్నారు, కానీ ఇది వ్యక్తిగత అవసరాలపై ఆధారపడి ఉంటుంది. షుగర్ intake గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు, లేకపోతే జీర్ణక్రియ సమస్యలు, నిద్రలేమి వంటి సమస్యలు ఏర్పడవచ్చు.