అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023: సూర్య నమస్కారాలు సరైన పద్దతిలో ఎలా చేయాలంటే?
ఈ వార్తాకథనం ఏంటి
యోగాసనాలు చేసేవారు సూర్యనమస్కాం ఖచ్చితంగా చేస్తుంటారు. యోగా అంటే సూర్య నమస్కారాలు మాత్రమే అనుకునేవారు కూడా ఉన్నారు. అంటే సూర్య నమస్కారాలు ఎంత పాపులరో అర్థం చేసుకోవచ్చు.
సూర్యుడు శక్తికి సంకేతం. సూర్యుడు ఉదయించక ముందే చేసే సూర్య నమస్కారం ఆసనాల వల్ల శారీరకంగా, మానసికంగా కొత్త శక్తి వస్తుంది.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, సూర్య నమస్కారాలు చేయడం వల్ల బాడీ మీద ఒకరకమైన కంట్రోల్ వస్తుంది. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అలాగే పని మీద ఫోకస్ పెరుగుతుంది.
సూర్య నమస్కారాల్లో మొత్తం 8భంగిమలు ఉంటాయి. ఈ భంగిమల్లో కొన్నింటిని ఎడమ వైపు, కుడివైపు చేయడం వల్ల మొత్తం 12స్టెప్స్ అవుతాయి.
Details
సూర్య నమస్కారాలను ఎలా చేయాలి?
ప్రణామాసనం:
యోగా మ్యాట్ అంచుల మీద నిటారుగా నిలబడి చేతులను పైకి లేపి శ్వాస పీల్చుకుంటూ నమస్కారం చేసి, చేతులను ఛాతి మీద ఉంచాలి.
హస్త ఉత్తాసనం:
ఈ పొజిషన్ లో చేతులను గాల్లో పైకి లేపి మీ శరీరాన్ని మొత్తం వెనక్కి వంచాలి.
హస్త పాదాసనం:
ఈ భంగిమలో మోకాళ్ళను వంచకుండా ముందుకు వంగాలి. చేతులను నేలను తాకించే ప్రయత్నం చేయాలి.
అశ్వ శంచలాసనం:
హస్త పాదాసనం భంగిమ నుండి నెమ్మదిగా మీ కుడి కాలును వెనక్కి తీసుకెళ్ళాలి. చేతులను నేలమీద ఆనించి కుడి మోకాలు నేలను తాకించాలి.
Details
వంకర లేని కర్రలా శరీరాన్ని వంచాల్సిన ఆసనం
పర్వతాసనం:
అశ్వ శంచలాసనం ఉన్న మీరు, రెండు కాళ్ళను వెనక్కి చాపి కేవలం కాలివేళ్ళ మీద నిలబడాలి. చేతులను నేలమీదే యధావిధిగా ఉంచాలి. ఈ పొజిషన్ లో మీ నడుము భాగం పర్వతంలా కనిపించాలి.
దండాసనం:
పర్వతాసనం నుండి మీ రెండు కాళ్ళను పూర్తిగా వెనక్కి తీసుకెళ్ళాలి. మీ అరచేతులు, కాలివేళ్ళ మీద మీ శరీర బరువును మోయాలి. ఈ భంగిమలో మీ శరీర ఆకారం ఒక వంకర లేని కర్ర మాదిరిగా ఉండాలి.
అష్టాంగ నమస్కారం:
ఈ భంగిమలో మీరు మీ నుదురును, ఛాతి భాగాన్ని నేలకు తాకించాలి. నడుము భాగాన్ని మాత్రం పైకి లేపి నేలను తాకకుండా చూసుకుంటూ పడుకోవాలి.
Details
నడుము నొప్పిని దూరం చేసే భుజంగాసనం
భుజంగాసనం:
అష్టాంగ నమస్కారంలో ఉన్న మీరు, నడుమును నేలమీద ఆనించి, నడుము నుండి పై భాగాన్ని పైకి లేపాలి. ఈ ఆసనం వల్ల నడుము నొప్పి రాకుండా ఉంటుంది.
భుజంగాసనం తర్వాత మళ్ళీ పర్వతాసనం, అశ్వ శంచలాసనం(ఈసారి ఎడమ కాలును వెనక్కి తీసుకెళ్ళాలి), పాద హస్తాసనం, హస్త ఉత్తాసనం, ప్రణామాసనం చేయాలి.