LOADING...
Reheated Rice : అన్నం మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమా?.. ఫుడ్ పాయిజన్‌ వస్తుందా!
అన్నం మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమా?.. ఫుడ్ పాయిజన్‌ వస్తుందా!

Reheated Rice : అన్నం మళ్లీ వేడి చేసి తింటే ప్రమాదమా?.. ఫుడ్ పాయిజన్‌ వస్తుందా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 19, 2026
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

చాలామంది అన్నం మళ్లీ వేడి చేసి తింటారు. ఇదొక సాధారణ విషయంగానే అనుకుంటారు. మరి ఇలా ఫుడ్ రీహీట్ చేసి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రమాదాలు ఉంటాయో చూసేద్దాం. తరచుగా వేడి చేసి తినే ఆహారాలలో అన్నం ఒకటి. ముఖ్యంగా ఇండియాలో ఉండేవారు ఎక్కువగా అన్నమే తీసుకుంటారు. ఇక్కడ మిగిలిపోయిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తినడం చాలా సాధారణంగా చెప్పవచ్చు. ఇలా మళ్లీ వేడి చేసుకుని అన్నం తినడం మంచిదేనా? అన్నం విషయంలో ఆహార భద్రతకు సంబంధించిన రహస్యం గురించి అందరికీ తెలియకపోవచ్చు. నిల్వ,వేడి చేసే పరిస్థితులపై ఆధారపడి అన్నం పాడైపోయి..ఫుడ్ పాయిజన్​ అవుతుందట. ఇలా అన్నం విషంగా మారడానికి బాసిల్లస్ సెరియస్ అనేది ప్రధాన కారణంగా చెప్తున్నారు.

Details

అన్నం వేడి చేస్తే..

వండిన అన్నంలో బాసిల్లస్ సెరియస్ బీజాంశం ఉంటుంది. ఇది భూమిపై సహజంగా కనిపించే వేడి-నిరోధక బ్యాక్టీరియాలో ఒకటి. వంట చేయడం వల్ల అన్ని బ్యాక్టీరియాలు చనిపోతాయని అనుకుంటాము. కానీ.. బీజాంశం అధిక ఉష్ణోగ్రతను తట్టుకోగలదు. అన్నం వండి.. ఎక్కువసేపు చల్లారకుండా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉంటే.. అప్పుడు ఈ బీజాంశాలు బ్యాక్టీరియాలుగా మారి వేగంగా పెరుగుతాయి. మళ్లీ వేడిచేసినప్పుడు టాక్సిన్‌లను కూడా ఉత్పత్తి చేస్తాయి. అలాంటి ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతుంది.

Details

ఫుడ్ పాయిజన్ లక్షణాలు

అన్నం వేడి చేసి తిన్నప్పుడు ఫుడ్ పాయిజన్​ అయితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కలుషితమైన అన్నాన్ని తీసుకున్న 1 నుంచి 6 గంటలలోపు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వికారం, వాంతులు అతిసారం ఉదర తిమ్మిరి లో ఫీవర్ లేదా బలహీనత చాలా సార్లు ఈ లక్షణాలతో కూడిన కేసులు చిన్నవిగా అనిపిస్తాయి. ఇవి 24 గంటల కంటే తక్కువ సమయం ఉంటాయి. కానీ పిల్లలు, గర్భిణులు, వృద్ధులు, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఎక్కువ ప్రమాదం ఉంటుంది.

Advertisement

Details

అన్నం విషయంలో చేసే తప్పులు

సమస్య అనేది వేడి చేసిన అన్నంతో కాదు.. దానిని ఎలా, ఎంతసేపు నిల్వ చేశారు అనేదానిపై ఉంటుంది. వంట చేసిన తర్వాత త్వరగా చల్లార్చడం (1-2 గంటలలోపు). రిఫ్రిజిరేటర్లో 5 °C కంటే తక్కువగా పెట్టి అన్నం స్టోర్ చేయడం. అన్నాన్ని 24 గంటల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచడం. ఒకసారి కంటే ఎక్కువ వేడి చేయడం. వేడి చేయడానికి చిట్కాలు అన్నం వండిన గంటలోపు రిఫ్రిజిరేట్ చేయండి. ముఖ్యంగా వేసవికాలంలో.. రిఫ్రిజిరేటర్‌లో అన్నాన్ని ఉంచడానికి సీలు చేసిన కంటైనర్‌ను ఉపయోగించండి. అన్నాన్ని ఒకటి కంటే ఎక్కువసార్లు వేడి చేయవద్దు.

Advertisement

Details

ఫుడ్ పాయిజన్​కి కారణం

అంతేకాకుండా వేడి చేసిన అన్నం ప్రమాదకరం కాదు. తప్పు అంతా స్టోరింగ్ మీదనే ఆధారపడి ఉంటుంది. వేడి-నిరోధక బ్యాక్టీరియల్ బీజాంశం.. వెచ్చని స్టోరేజ్, ఆలస్యమైన కూలింగ్ కలయిక వల్ల టాక్సిన్‌ల ఉత్పత్తిని పెంచుతుంది. ఇది ఫుడ్ పాయిజన్​కి కారణమవుతుంది.

Advertisement