
కూరలో ఉప్పు, కారం ఎక్కువైందా.. ఇలా చేస్తే టెస్ట్ అదిరిపోతుంది
ఈ వార్తాకథనం ఏంటి
ఉప్పు లేని కూర రుచి ఉండదు. మనం వాడే ప్రతి వంటకానికి ఉప్పు వాడాల్సిందే. లేకపోతే మన నాలుక వాటిని ముట్టుకోవడానికి ఇష్టపడదు.
ఎంతో ఇష్టంగా కష్టపడి చేసిన వండిన కూరలో ఉప్పు ఎక్కువైతే దాన్ని తినడానికి మనసు రాదు.
దీంతో వండిన కూర మొత్తం వేస్ట్ అయిపోతుంది. అయితే కూరలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొన్ని చిట్కాలను పాటిస్తే టెస్ట్ అదిరిపోతుంది.
అదెలాగో ఇప్పుడు తెలుసుకోండి. ముఖ్యంగా కూరలో ఉప్పు లేదా కారం లేదా మసాలా ఎక్కువైనప్పుడు వాటిలో బంగాళ దుంపలు వేయొచ్చు.
బంగాల దుంపలే కాకుండా బియ్యం, బ్రెడ్ వంటి ఇతర పిండి పదార్థాలు కూర రుచులను గ్రహించి వాటిని సమానం చేయడంలో సాయపడతాయి.
Details
ఈ చిట్కాలతో కూరలో కారాన్ని తగ్గించుకోవచ్చు
కొన్ని కూరల్లో పెరుగును వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాక మసాలాల వల్ల కలిడే వేడిని, కారాన్ని తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
కేవలం పెరుగే కాకుండా క్రీమ్ కూడా కూరల్లో వేయొచ్చు. టమోటా కెచప్ సాధారణంగా తీపి రుచిని కలిగి ఉంటుంది.
దీన్ని కూరలో వేయడం వల్ల కారం తగ్గించుకోవచ్చు. లేదంటే కర్రీలో చక్కెర వేసి కూడా కారాన్నీ తగ్గించవచ్చు.
మసాలాలు, ఉప్పు, కారం ఎక్కువైతే నిమ్మకాయ రసాన్ని కలిపితే కూర టెస్టీగా మారుతుంది.
ఈ చిట్కాలను ఫాలో కర్నీని డస్ట్ బిన్‌లో వేయాల్సిన అవసరం రాదు.