
Motivation: ఈ నాలుగు విషయాల్లో మహిళలు మౌనం పాటిస్తే మంచిది
ఈ వార్తాకథనం ఏంటి
స్త్రీల గౌరవం కాపాడుకోవాలంటే కొన్ని సందర్భాల్లో మౌనం పాటించడం ఎంతో ముఖ్యం అని చాణక్యుడు తన నీతిశాస్త్రంలో చెప్పాడు. ఆ సమయంలో అనవసరంగా మాట్లాడితే గౌరవానికి నష్టం కలగవచ్చని ఆయన హెచ్చరించాడు భర్త కోపంగా ఉన్నప్పుడు భార్య ఏ విషయంపైనా భర్త కోపంగా ఉన్నప్పుడు, ఆ సమయంలో ఆమె మౌనం పాటించడం ఉత్తమం. అలా చేయకపోతే వాగ్వాదం పెరిగి, వారి ప్రేమ జీవితంపైనా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది.
Details
కుటుంబ పెద్దలు మాట్లాడుతున్నప్పుడు
ఇంట్లో పెద్దలు ఏదైనా విషయంపై మాట్లాడుతున్నప్పుడు స్త్రీలు మధ్యలో జోక్యం చేసుకోవద్దు. అలా మాట్లాడటం మంచిది కాదని, దీనివల్ల వారి గౌరవం తగ్గిపోవచ్చని చాణక్యుడు సూచించాడు. ఎవరైనా బాధలో ఉన్నప్పుడు స్త్రీలకు సాధారణంగా మాట్లాడే అలవాటు ఎక్కువగా ఉంటుంది. కానీ ఎవరు బాధలో ఉన్నప్పుడు వారిని ఓదార్చటానికి కంటే మౌనం పాటించడం ఉత్తమం. ఆ సమయంలో ఎక్కువగా మాట్లాడటం గౌరవానికి విరుద్ధంగా పరిగణించబడుతుంది. పూజలు, ధార్మిక కార్యక్రమాల్లో పూజలు, యజ్ఞాలు, హోమాలు జరుగుతున్నప్పుడు కూడా స్త్రీలు మౌనంగా ఉండడం అవసరం. ఇవన్నీ ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన కార్యక్రమాలు కాబట్టి, అతి మాట్లాడటం మంచిది కాదు.