Karthika Masam: కార్తీక మాసం 23వ రోజు ఇలా చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఖాయం!
ఈ వార్తాకథనం ఏంటి
కార్తీక మాసం 23వ రోజు, నవంబర్ 13, గురువారం రోజున వచ్చే ఈ ప్రత్యేక తిథికి విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఈ రోజున కొన్ని పవిత్ర విధులు పాటిస్తే ఆర్థికంగా శ్రేయస్సు చేకూరుతుంది, ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి, ఐశ్వర్యం నిలకడగా వృద్ధి చెందుతుంది. అంతేకాక, ఈ రోజున వినవలసిన ప్రత్యేక కథను శ్రద్ధగా వినడం ద్వారా అద్భుత ఫలితాలు లభిస్తాయి. ఈ రోజు రావి ఆకుతో చేయబడే శక్తివంతమైన పరిహారం ఎంతో విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. దీన్ని భక్తితో చేస్తే మనసులో కోరుకున్న కోరికలు 41 రోజులలో నెరవేరుతాయని శాస్త్రోక్తంగా చెబుతారు.
వివరాలు
దానం చేస్తే.. ఆర్థికంగా ఉన్నత స్థితికి..
కార్తీక మాసం 23వ రోజున ప్రత్యేక దానం చేయడం అత్యంత పుణ్యఫలప్రదమని పండితులు చెబుతున్నారు. ఈ రోజు దానం చేసిన వ్యక్తిని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తుంది. ఆఖండ ఐశ్వర్యం పొందాలన్నా, ఆదాయ మార్గాలు విస్తరించాలన్నా దేవాలయ ప్రాంగణంలో నర్మదా బాణలింగం లేదా సాలగ్రామ శిలలను అర్చకులకు దానం చేయడం శ్రేయస్కరం. ధర్మరాజులా రాజమర్యాదలతో కూడిన జీవితాన్ని పొందే శుభఫలితం లభిస్తుంది. ఇదే ఈ రోజుని విశేషత.
వివరాలు
తులసి పూజతో లక్ష్మీకటాక్షం
తులసి కోటలో పసుపుపచ్చ చామంతి పూలను సమర్పించి నమస్కరించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చు. గతంలో ధనవంతులై ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, లేదా పోయిన ఐశ్వర్యాన్ని తిరిగి పొందాలనుకునేవారు ఈ రోజున 108 తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజించడం ఉత్తమం. లక్ష్మీనారాయణుల, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, వెంకటేశ్వరుడు, లక్ష్మీ నరసింహుడు వంటి విష్ణుస్వరూపాల ఫోటో ఎదుట 108 తులసి దళాలతో పూజ చేసి, అనంతరం ఆలయంలో స్వయంగా వండిన నైవేద్యాన్ని దానం చేయాలి. ఇలా చేసినవారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం కలిగి రాజ వైభవం లభిస్తుంది.
వివరాలు
స్నానవిధి ద్వారా పాపక్షయము
అదే రోజున స్నానం చేసే సమయంలో తలపై ఒక ఉసిరిక ఆకు లేదా ఉసిరిక కాయ, లేక జిల్లేడు ఆకు ఉంచుకుని స్నానం చేయాలి. ఈ ఆచారాన్ని పాటించడం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి. శుభఫలాలు, ఆయురారోగ్యం, ఐశ్వర్యం లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి.