వర్షాకాలంలో మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఏం చేయాలంటే?
వర్షాకాలం వచ్చేసి వేడిని మొత్తం పోగొట్టేసింది. ఈ టైమ్ లో మీరు మీ ఇంటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. వర్షాకాలంలో ఇంటిని శుభ్రంగా ఉంచుకోకపోతే అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకోండి. పురుగులు రాకుండా నిరోధించండి: రుతువు మారడం వల్ల వాతావరణంలో ఏర్పడిన తేమ కారణంగా పురుగులు బయటకు వస్తాయి. దోమలు, చెదలు, వానపాములు ఈ కాలంలో ఎక్కువగా బయటకు వస్తుంటాయి. ఈ పురుగులు హానికరం కాకపోయినా చెక్క సామాగ్రిని, గోడలను పాడు చేస్తాయి. అందుకే జాగ్రత్తగా ఉండండి. బాత్రూమ్ లో వెలుతురు అవసరం: బాత్రూమ్ లో ఎక్కువ వెలుగు ఉండాలి. అయితే వెలుగును తీసుకొచ్చే వెంటిలేటర్లకు నెట్ తగిలిస్తే ఎలాంటి కీటకాలు రాకుండా ఉంటాయి
తడిబట్టలను పొడిబట్టలను వేరు చేస్తేనే శుభ్రత
బట్టలను వెంటనే ఉతకండి: బట్టలను వెంటనే ఉతికేసి ఆరేసుకోవడం మంచిది. ఉతకడంలో ఆలస్యం చేస్తే ఆ బట్టల నుండి అదోరకమైన వాసన వస్తుంది. అందువల్ల వెంట వెంటనే ఉతుక్కోవడం ఉత్తమం. తడి బట్టలను, పొడిబట్టలను ఒకే దగ్గర ఉంచకుండా జాగ్రత్త వహించండి. కలప సామాగ్రిని జాగ్రత్తగా చూసుకోవాలి: కలపతో చేసిన సోఫాలు, కుర్చీలు మొదలైన ఫర్నీచర్స్, తేమ కారణంగా పాడవుతుంటాయి. అందుకే వర్షాకాలం ఆరంభమవగానే వాటిని వార్నిష్ వేయండి. చెక్క తలుపులు, కిటీకీలకు వార్నిష్ వేయండి. ఈ కాలంలోని తేమ కారణంగా కిటికీ తలుపులు మూసుకోకపోతే సాండ్ పేపర్ ఉపయోచించాలి.