Page Loader
కేరళలో వందేభారత్: విశేషాలు ఛార్జీలు, రూట్లు తెలుసుకోండి 
కేరళలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రారంభించిన నరేంద్ర మోదీ

కేరళలో వందేభారత్: విశేషాలు ఛార్జీలు, రూట్లు తెలుసుకోండి 

వ్రాసిన వారు Sriram Pranateja
Apr 25, 2023
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రైల్వేరంగం కొత్త పుంతలు తొక్కుతోంది. గమ్యాన్ని త్వరగా, సురక్షితంగా చేర్చాలనే ఉద్దేశ్యంతో దేశంలో వందేభారత్ రైలు ప్రారంభమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వందేభారత్ ఎస్క్ ప్రెస్ సేవలు మొదలయ్యాయి. తాజాగా కేరళలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈరోజు వందేభారత్ ఎక్స్ ప్రెస్ ని ప్రారంభించారు. తిరువనంతపురం నుండి మొదలు: తిరువనంతపురం నుండి మొదలయ్యే ఈ రైలు, కాసర్ గోడ్ వరకు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో 11జంక్షన్లు వస్తాయి. తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిశూర్, పాలక్కడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసర్ గోడ్ ల మీదుగా ప్రయాణిస్తుంది. ఒకవారంలో గురువారం తప్ప ప్రతీరోజూ, వందేభారత్ సేవలు కొనసాగుతాయని సమాచారం.

Details

వందేభారత్ టైమింగ్స్, ఛార్జెస్: 

తిరువనంత పురం సెంట్రల్ రైల్వే స్టేషన్(TVS) నుండి ఉదయం 5:30గంటలకు మొదలవుతుంది. కొల్లాం స్టేషనుకు ఉదయం 6:07గంటలకు, కొట్టాయం స్టేషనుకు ఉదయం 7:25గంటలకు, ఎర్నాకులం టౌన్న్ స్టేషనుకు 8:17am వరకు, త్రిశూర్ 9:22am, షోరనూర్ స్టేషనుకు 10:02am వరకు చేరుకుంటుంది. ఆ తర్వాత కోజికోడ్ 11:03am, కన్నూర్ 12:03pm, చివరగా కాసర్ గోడ్ స్టేషనుకు 1:25pm వరకు చేరుకుంటుంది. ఛార్జీలు: 20634 అనే నంబర్ గల రైలు, టీవీఎస్ నుండి కాసర్ గోడ్ వరకు ఛెయిర్ కార్ అయితే 1590రూపాయల ఛార్జ్(379రూపాయల క్యాటరింగ్ ఛార్జెస్ తోకలిపి) ఉంది. ఎగ్జిక్యూటివ్ క్లాస్ అయితే 2880రూపాయల ఛార్జ్ (434రూపాయల క్యాటరింగ్ ఛార్జ్ కలుపుకుని) ఉంది.