Page Loader
కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

వ్రాసిన వారు Stalin
Apr 25, 2023
01:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరువనంతపురం నుంచి కాసర్‌గోడ్‌ వరకు నడిచే కేరళ తొలి వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ప్రారంభించారు. తిరువనంతపురం సెంట్రల్ స్టేషన్‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చ జెండా ఊపారు. ఈ కార్యక్రమంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌, గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. వందే భారత్ రైలు తిరువనంతపురం, కొల్లాం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్ మరియు కాసర్గోడ్ వంటి 11 జిల్లాలను కవర్ చేస్తుంది. కేరళకు మంగళవారం విచ్చేసిన ప్రధాని మోదీ రూ.3,200 కోట్లకు పైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

జెండా ఊపి వందేభారత్ రైలును ప్రారంభించిన మోదీ