38 Tooth : గిన్నిస్ రికార్డు సాధించిన మహిళా.. ఎందుకో తెలుసా
కల్పనా బాలన్, పేరుకు 26 ఏళ్ల యువతి. కానీ ఆమె ప్రపంచ గిన్నిస్ రికార్డులో చోటు సంపాదించింది. అంతేకాదు,వరల్డ్ గిన్నిస్ బుక్'లో చోటు దక్కించుకోవడం లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అంటూ సంబరపడిపోతోంది. భారతదేశానికి చెందిన కల్పానా బాలన్ కి ఉండాల్సిన దానికంటే ఎక్కువ పళ్లు(tooth)ఉన్నాయి. సాధారణంగా 32 వరుసల దంతాలు ఉంటాయి. కానీ ఈ ఈమెకి 38 వరుస దంతాలు ఉండటం విశేషం.దీంతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను అందుకుంది. ఈ సందర్భంగా ఒక మహిళా నోటిలో అత్యధిక దంతాలు కలిగిన్న వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకుంది. బాలన్ దిగువ దవడపై నాలుగు అదనపు దంతాలు ఉండటం కొసమెరుపు. ఆమె దవడ పై వరుసలో రెండు అదనపు పళ్లు ఉండటం గమనార్హం.
రికార్డు పెరిగే అవకాశం ఉంది : బాలన్
కల్పనా బాలన్, యుక్త వయస్సులో ఉన్నప్పుడు సూపర్ న్యూమరీ దంతాలు (జ్ఞాన దంతాలు) అదనంగా పెరిగాయి. అయితే మొదట్లో ఆమె వాటిని తీసేయాలని భావించింది. ఈ క్రమంలోనే దంత వైద్యులను సంప్రదించారు. అనంతరం వాటిని తొలగించకూడదని నిర్ణయించుకున్నట్లు బాలన్ తెలిపారు. సదరు అదనపు దంతాలు తన ఆరోగ్యానికి ఎటువంటి కష్టం కలిగించనందున, పైగా నోట్లో నొప్పిని కలిగించవు కాబట్టి తొలగింపు ప్రక్రియను విరమించుకున్నట్లు వివరించారు. ఇవే కాక ఆమెకు మరో రెండు దంతాలు రానున్నాయని,భవిష్యత్ లో మరో రికార్డు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు దంత వైద్యులు నిర్ధారించారన్నారు. మరోవైపు ఈవనో మెల్లనో అనే కెనడియన్ 41 దంతాలతో గిన్నిస్ బుక్ రికార్డులో పేరు సంపాదించారు. అయితే బాలన్ మహిళా విభాగంలో చరిత్ర సృష్టించింది.