Sankrathi Special Sakinalu: కరకరలాడే తెలంగాణ స్పెషల్ సకినాల తయారీ విధానం
ఈ వార్తాకథనం ఏంటి
సకినాలు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఒక పిండి వంటకం.ఇది బియ్యపుపిండి ఉపయోగించి వృత్తాకారంలో తయారుచేసి నూనెలో వేయిస్తారు.
మకర సంక్రాంతి పండుగ సమయంలో తెలంగాణ పల్లెల్లో ఈ వంటకం ప్రధానంగా తయారవుతుంది.
సకినాలు చాలారోజులు నిల్వ ఉంటాయి.తెలంగాణలో ఏ శుభకార్యమైనా,ముఖ్యంగా పెళ్లిళ్లలో సకినాలు తప్పనిసరిగా ఉంటాయి.
పెళ్లి సంబంధిత కార్యక్రమాలలో,నవ వధువు తల్లిదండ్రులు,బంధువులు,స్నేహితులకు పంపిణీ చేయడానికి వరుడి తల్లిదండ్రులకు 5బుట్టలలో ఒకటి సకినాల బుట్ట ఇస్తారు.
అలాగే,సంక్రాంతి సమయంలో చలి కారణంగా వచ్చే జలుబు,దగ్గు వంటి వ్యాధుల నుంచి ఉపశమనానికి సకినాలలో వేసిన వాము,నువ్వులు ఉపయోగపడతాయి.
వీటిని సంక్రాంతి సమయంలో ఎందుకంటే,ఈ పిండి వంటకం శరీరానికి అవసరమైన తాపాన్ని ఇస్తుంది.సకినాలు తయారుచేసేటప్పుడు మొదటి సకినం మధ్యలో గౌరమ్మను ఉంచి గౌరీ పూజా చేస్తారు.
వివరాలు
చకినాల తయారీకి కావాల్సిన పదార్థాలు:
చకినాలు, లేదా సకినాలు అనే పదం "చకినము" లేదా "చక్రం" అనే పదం నుండి వచ్చిందని అర్థం.
మకర సంక్రాంతి సందర్భంగా కొత్త వరి పంట పండినప్పుడు రైతులు ఈ సంప్రదాయ వంటకాలను తయారుచేస్తారు.
చకినాల తయారీకి మూడు చుట్లతో చుట్టు తయారుచేసే సంప్రదాయం ఉంది. ఇంటి ఆచారాలకు అనుగుణంగా చుట్టల సంఖ్య పెరిగి తగ్గవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
తెల్ల నువ్వులు,
పచ్చిమిర్చి లేదా కారం,
ఉప్పు రుచికి సరిపడా,
వాము కొద్దిగా
వివరాలు
తయారీ విధానం:
ముందుగా బియ్యం తీసుకుని సరిపడే నీటిలో నానబెట్టాలి. ఆ తర్వాత ఆ తడి బియ్యాన్ని పిండి పట్టించుకోవాలి.
ఒక కిలో పాత బియ్యాన్ని ఒకరోజు నానబెట్టి ఆరబెట్టి పిండి ఆడించాలి.
పిండిని ఎండలో పది నిమిషాల పాటు ఉంచాలి.
100 గ్రాముల నువ్వులు, 10 గ్రాముల వాము, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.
పిండిలో నీటిని పోసి నప్పించి, గట్టిగ కాకుండా, పలచగా కాకుండా కలిపి, 15 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి.
తర్వాత ఈ పిండిని కాటన్ వస్త్రంలో కట్టి గుండ్రంగా చుట్టి, నూనెలో వేసి వేయించుకోవాలి. ఇలా రుచికరమైన సకినాలు తయారవుతాయి.
ఈ సకినాలను వేర్వేరు షేప్స్‌లో తయారుచేసుకోవచ్చు.ఉదాహరణకు పలక,బలపం,రోలు,రోకలి మురుకు, పిల్లలకు ఇష్టమైన షేప్స్ కూడా చేయవచ్చు.
వివరాలు
ఆరోగ్య ప్రయోజనాలు:
సకినాలలో వాము జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తుంది. నువ్వులు ఈ వంటకంలో ప్రధాన పదార్థం. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
నువ్వులలో ఇనుము, అమినోయాసిడ్‌లు, మెగ్నీషియం, మాంసకృత్తులు, కాల్షియం అధికంగా ఉంటాయి.
ఇవి రక్తపోటు నియంత్రణ, రక్తంలోని చక్కెర స్థాయిని అదుపు చేయడంలో సహాయపడతాయి.
అదేవిధంగా, నువ్వులు హృదయ వ్యాధులను నివారించే యాంటీ ఆక్సిడెంట్స్‌తో కూడుకున్న సెసమాల్ ను కలిగి ఉంటాయి.
లిగ్నిన్స్ అనే ఫైబర్ చెడు కొవ్వును తగ్గించేందుకు సహాయపడుతుంది. అలాగే, ఈ సకినాలు మానసిక ఒత్తిడి నుంచి రక్షించడంలో సహాయపడతాయి.