నవ్వు బీపీని కంట్రోల్ చేయడంతో పాటు గుండెను పదిలంగా కాపాడుతుంది
ప్రశాంతమైన చిరునవ్వు వల్ల మనం ఎన్నో రకాల లాభాలని పొందవచ్చు. మనం ఆనందంగా నవ్వుతూ ఉంటే మన హర్మోన్లులో కూడా మార్పు వస్తుంది. ఈ కారణంగా ఒత్తిడి తగ్గి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయి. ఎప్పుడూ ముఖం మాడ్చుకొని ఉండేవాళ్లకి గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువని ఇటీవల పరిశోధకులు కూడా చెప్పారు. ఎప్పుడూ నవ్వుతూ ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. గతంలో కూడా మేరీలాండ్ యూనివర్శటి పరిశోధకులు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. నవ్వూతూ ఉంటే మానసిక భావోద్వేగాలు అదుపులోకి రావడంతో పాటు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
చిరునవ్వుతో ఎన్నో రకాల ప్రయోజనాలు
నవ్వు బీపీని దూరం చేస్తుంది సమాజంలో ఉరుకులు, పరుగులతో నవ్వడం చాలా కష్టతరంగా మారింది. ఇంట్లో, బయట, ఆఫీస్ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ టెన్షన్ తో గడిపేస్తున్నాం. దీంతో ముఖంపై చిరునవ్వు కనమరుగు అవుతోంది. ముఖ్యంగా గుండెజబ్బులు పెరగడానికి టెన్షన్లు, ఒత్తిళ్లే ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాస్తంత నవ్వితే, ఆ ఒత్తిడి దూరమవుతుంది. ఈ కారణంగా బీపీ, హైపర్ టెన్షన్, గుండె సమస్యలు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. చిరునవ్వుతో గుండె పదిలం ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవాళ్ల గుండె సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. నవ్వుకీ, గుండె రక్తనాళాల పనితీరుకి చాలా దగ్గరి సంబంధం ఉందని 2005లో మేరీలాండ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ధృవీకరించారు.