
ఫుడ్ కాంబినేషన్స్: ఏ రెండు ఆహారాలను కలిపి తినకూడదో ఇక్కడ తెలుసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారం ఆరోగ్యకరమైనది అయ్యుండాలి. లేదంటే అనర్థాలు తప్పవు. ముఖ్యంగా రెండు ఆహారాలను కలిపి తీసుకునేటపుడు జాగ్రత్తగా ఉండాలి.
ఏ రెండు ఆహారాలను కలిపి తినకూడదో, తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
చేపలు, పాలు:
ఈ రెండు ఆహారాలను సెపరేట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేప తిన్న చాలా సేపటి తర్వాత మాత్రమే పాలు తీసుకోవాలి. ఒకవేళ రెండింటినీ కలిపి తీసుకుంటే మీకు నష్టం జరుగుతుంది.
ఆయుర్వేదం ప్రకారం, చేపలు వేడి, పాలు చల్లదనం.. రెండింటి మిక్స్ వల్ల మీ జీర్ణ వ్యవస్థ, రక్త ప్రసరణ వ్యవస్థ దెబ్బ తింటుంది.
Details
జీర్ణసమస్యలను తీసుకొచ్చే పండ్లు
పాలు, పండ్లు:
సిట్రస్ ఫ్రూట్స్ అయిన ద్రాక్ష, నారింజ, బెర్రీలు మొదలైన వాటిని పాలతో కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల గ్యాస్, అసిడిటీ వంటి ఇబ్బందులు కలుగుతాయి.
మెలన్, నీళ్ళు:
మస్క్ మెలన్, వాటర్ మెలన్ మొదలైన వాటిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని అధ్యయనంలో వెల్లడైంది.
మెలన్ లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి నీటితో కలిపి తీసుకుంటే శరీర పీహెచ్ స్థాయిల్లో మార్పులు వస్తాయి. దానివల్ల అసిడిటీ కలిగే అవకాశం ఉంది.
ఆహారం, పండ్లు:
పండ్లను ఆహారంతో పాటు తీసుకుంటే పండ్లలోని ఫ్రక్టోజ్, ఆహారంలోని కార్బోహైడ్రేట్స్ తో కలిసిపోయి జీర్ణ సమస్యలను తీసుకొస్తుంది. దీనివల్ల కడుపునొప్పివంటి సమస్యలు వస్తాయి.