NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / Ganesh Chaturthi 2024: అష్ట వినాయకుల ప్రత్యేకతలేంటి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి 
    తదుపరి వార్తా కథనం
    Ganesh Chaturthi 2024: అష్ట వినాయకుల ప్రత్యేకతలేంటి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి 
    అష్ట వినాయకుల ప్రత్యేకతలేంటి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి

    Ganesh Chaturthi 2024: అష్ట వినాయకుల ప్రత్యేకతలేంటి.. వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 04, 2024
    10:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిందూ మత విశ్వాసాల ప్రకారం, అష్టవినాయక ఆలయాలు స్వయంభువుగా వెలిశాయి.

    మహారాష్ట్రలోని పశ్చిమ ప్రాంతంలోని మోర్గావ్, లేన్యాద్రి, పాలీ వంటి ప్రాంతాల్లో ఉన్న ఈ ఎనిమిది ఆలయాలకూ ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.

    పురాణంలోని ఒక శ్లోకం కారణంగా మహారాష్ట్రలోని అష్టవినాయక స్థలాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి.

    అందుకే అష్టవినాయక యాత్రకు ప్రాధాన్యత పెరిగింది. మహారాష్ట్ర తూర్పు ప్రాంతం అయిన విదర్భ సహజసిద్ధమైన ప్రాంతం.

    ఈ ప్రాంతం గొప్ప ప్రాచీన సంప్రదాయాలను కలిగి ఉంది. విదర్భ ప్రావిన్స్‌లో కూడా వినాయకుడికి సంబంధించిన విశిష్ట స్థలాలున్నాయి.

    'విదర్భ అష్టవినాయక' అనే పదం ఎనిమిది ప్రధాన గణేశ దేవాలయాలనూ సూచిస్తుంది. ఈ దేవాలయాలు వివిధ కాలాల్లో అభివృద్ధి చెందాయి.

    Details

     హిల్ గణపతి, నాగ్‌పూర్

    విదర్భ అష్టవినాయక దేవాలయాలలో మొదటిగా గుర్తించింది గణేశుడు నాగ్‌పూర్‌లోని హిల్ గణపతి.

    ఈ ప్రసిద్ధ దేవాలయం ఒక పురాతన దేవాలయం శిథిలాల్లో స్వయంభూ గణేశుడి విగ్రహం కనుగొన్నట్లు చెబుతారు.

    మొట్టమొదట ఇది సాధారణమైన ఆలయంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇది మహా పుణ్యక్షేత్రంగా మారింది.

    ప్రతిరోజూ ఉదయం 4:30 గంటలకే పూజలు ప్రారంభమవుతాయి. మంగళ, శనివారాల్లో ఇక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది.

    Details

     బృశుండ వినాయక్, భండారా

    విదర్భలోని అష్టవినాయక దేవాలయాలలో బృశుండ వినాయక్ భండారా జిల్లాలోని మెంధ గ్రామంలోని వైనగంగా నది ఒడ్డున ఉంది.

    ఈ ఆలయంలో గణేశుడి విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తుతో, సవ్యలలితాసనంలో ప్రతిష్టించారు.

    విగ్రహం చతుర్భుజం ఆకారంలో ఉండి, చేతుల్లో వరద ముద్ర, అంకుశం, పాశం, మోదకాలను కలిగి ఉంటుంది.

    Details

    సపుతర పర్వతాల్లో పద్దెనిమిది చేతుల గణపతి

    రాముడు వనవాస సమయంలో రామ్‌టెక్‌లో ఉన్నాడని నమ్ముతారు. సపుతర పర్వత శ్రేణిలో ఉన్న ఈ ప్రదేశం విదర్భ అష్టవినాయకులలో ఒకటిగా చెప్పొచ్చు.

    ఇక్కడి అష్టాదశభుజ గణపతి విగ్రహం పద్దెనిమిది చేతులతో ఉండడం విశేషం. ఈ విగ్రహం గణేశుడికి పద్దెనిమిది శాస్త్రాల పట్ల పరిజ్ఞానం ఉందని చెబుతారు.

    షమీ గణేష్, అదాస

    అదాస క్షేత్రం నాగ్‌పూర్ - చింద్వారా రైల్వే మార్గంలో పట్నా సవాంగి స్టేషన్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

    ఇది ఎత్తైన కొండపై ఉన్న ఒక పురాతన గణేశ దేవాలయం. ఇక్కడి విగ్రహం నృత్య వినాయకుడిదని పండితులు చెబుతున్నారు.

    ఈ విగ్రహం త్రిశూలం, పాశం, అంకుశం, మోదకాలను కలిగి ఉంటుంది.

    Details

     వరద వినాయక్, భద్రావతి

    వరద వినాయకుడు భద్రావతిలోని భాండక్ అనే ప్రదేశంలో కొండపై ఉన్నాడు.

    ఇక్కడి గణేశుడి విగ్రహం ఎనిమిది అడుగుల ఎత్తులో కూర్చున్న భంగిమలో ఉంటుంది.

    ఈ ఆలయం 16 స్తంభాలతో కూడిన గొప్ప హాలుతో ప్రసిద్ధి చెందింది.

    పంచముఖి గణపతి, పావని

    పంచముఖి గణపతి భండారా జిల్లాలోని వైన గంగా నది ఒడ్డున ఉన్న పావని గ్రామంలో స్థితి ఉంది. ఇక్కడ గణపతి విగ్రహం కన్నా ఐదు ముఖాల రాతి రూపం ఉంది.

    ఈ ఆలయానికి పంచనన్, విఘ్నరాజ్ వంటి పేర్లు ఉన్నాయి.

    Details

     చింతామణి, కలంబ

    కలంబలోని చింతామణి ఆలయం భక్తుల బాధలను పోగొట్టే విశిష్ట స్థలంగా భావిస్తారు.

    ఇక్కడి గణపతి విగ్రహం భూమిలో సుమారు 15 అడుగుల లోతులో ఉంది.

    ఈ ఆలయంలో నీటి ప్రవాహాలు భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

    ఏకచక్ర గణేశ్, కెల్జార్ కోట

    కెల్జార్ కోటలో ఉన్న ఈ ఏకచక్ర గణేశ దేవాలయం పాండవుల కాలం నాటి గణేశ స్థలంగా ప్రసిద్ధికెక్కింది.

    ఈ ఆలయానికి పాండవులు గణేశ విగ్రహాన్ని ప్రతిష్టించారని నమ్ముతారు. ఈ 8 దేవాలయాలు విశేషమైన పవిత్రతను కలిగి ఉంటాయి.

    ఇవి ఏదైనా నిర్దిష్ట క్రమంలో దర్శనం చేయాల్సిన అవసరం లేదు. కావున భక్తులు తమ సమయాన్ని బట్టి యాత్రకు వెళుతుంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వినాయక చవితి
    పండగ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    వినాయక చవితి

    Jio AirFiber: సెప్టెంబర్ 19న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభం: ముకేశ్ అంబానీ  రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్
    Vinayaka Temples: భారతదేశంలోని ప్రసిద్ధ వినాయకుడి దేవాలయాలు  పండగ
    వినాయక చవితికి ముందు రోజు జరుపుకునే గౌరీ గణేష్ హబ్బా గురించి మీకు తెలుసా?  పండగ
    వినాయక చవితి: పర్యావరణం సురక్షితంగా ఉండేలా గణపతి డెకరేషన్ ఇలా చేయండి  పండగ

    పండగ

    హోళీ రంగులు మీ జుట్టును పాడుచేయకుండా ఉండాలంటే చేయాల్సిన పనులు హోలీ
    Holi 2023: రసాయనాలు లేని రంగులు తయారు చేద్దాం రండి హోలీ
    హోళీ రోజు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో తెలియజేసే టిప్స్, ఆడవాళ్ళకు మాత్రమే హోలీ
    హోళీ పండగ రోజు మీ చర్మాన్ని సురక్షితంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్స్ చర్మ సంరక్షణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025