
Vinayaka Chavithi Festival:వీధుల్లో వినాయకుడి ఉత్సవాలకు నాంది పలికింది ఎవరు? అసలు కారణం ఇదే
ఈ వార్తాకథనం ఏంటి
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని వినాయకుడి విగ్రహాలను వీధుల్లో ప్రతిష్టించే సంప్రదాయం ఎలా ప్రారంభమైందో ఓసారి తెలుసుకుందాం.
ఈ సంప్రదాయం అనేది భారతదేశ స్వాతంత్య్ర పోరాటంతో కూడా సంబంధం ఉంది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకోండి వినాయకుని పండుగ హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకం.
వినాయకుడు వీధుల్లో ప్రజలకు చేరువగా ఉంటాడు.
కానీ ఈ సంప్రదాయం వెనుక ఉన్న చరిత్ర గురించి చాలా మందికి తెలియదు.
Details
ఉత్సవాలకు పిలుపునిచ్చిన బాల గంగాధర్ తిలక్
బ్రిటీష్ వారి పాలనలో భారతదేశానికి స్వాతంత్య్ర కోసం పోరాడాల్సిన అవసరం ఏర్పడింది.
ఈ పోరాటంలో భారతీయులందర్నీ ఏకం చేయడానికి పండుగలను వేదికగా మార్చాలనే ఆలోచన వచ్చింది.
1894లో మహారాష్ట్ర పుణే నగరంలో ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లోకమాన్య బాల గంగాధర్ తిలక్ గణేశ్ ఉత్సవాలను సామూహికంగా జరపాలని నిర్ణయించారు.
ఆ పిలుపుతోనే గణపతి ఉత్సవాలు మహారాష్ట్ర, హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.
Details
స్వాతంత్య్ర పోరాటానికి మూలస్తంభంగా వినాయక ఉత్సవాలు
హైదరాబాద్‌లో 1895లో శాలిబండ ప్రాంతంలో భారత గుణవర్థక్ సంస్థ స్థాపించింది.
ఈ సంస్థ ఆధ్వర్యంలో విగ్రహాలను ప్రతిష్టించి, 9 రోజుల పాటు పూజలు చేసి, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ ఉత్సవాలు సామాజిక చైతన్యం కలిగించడమే కాకుండా, ప్రజలను ఒకతాటిపైకి తీసుకురావడంలో కూడా ప్రధాన పాత్ర పోషించాయి.
అందుకే వినాయక ఉత్సవాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాకుండా, భారత స్వాతంత్య్ర పోరాటానికి మూలస్తంభంగా నిలిచాయి.
ఇలా ప్రారంభమైన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతూ, ప్రతి గణనాయకుడి పండుగలో ప్రజలకు సమైక్యతను చాటిస్తోంది.