Allu Sirish: అల్లు శిరీష్ నిశ్చితార్దానికి తుపాను ఎఫెక్ట్.. అనుకున్నదొకటి,అయినది మరొకటి..?
ఈ వార్తాకథనం ఏంటి
టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరైన అల్లు శిరీష్ కొత్త అడుగు వేయబోతున్నారు. తన ప్రియురాలు నైనికాతో నిశ్చితార్థం జరగబోతుందని ఆయన ఇటీవల ప్రకటించడంతో, మెగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. అయితే, ఈ వేడుకకు వాతావరణం ఊహించని ఆటంకంగా మారింది. శిరీష్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటోను పోస్ట్ చేస్తూ, "చలికాలంలో అవుట్‌డోర్ నిశ్చితార్థం ప్లాన్ చేశా... కానీ వాతావరణం, దేవుడికి వేరే ఆలోచనలు ఉన్నట్టున్నాయి" అని వ్యాఖ్యానించారు. వర్షంలో డెకరేషన్ పనులు సాగుతున్న దృశ్యాన్ని జత చేయడంతో, ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాలు
వాతావరణం అనుకూలిస్తే నిశ్చితార్థ వేడుకను అవుట్‌డోర్‌లోనే నిర్వహించే అవకాశం
అక్టోబర్ 31న హైదరాబాద్‌లోని తమ నివాసంలోనే నిశ్చితార్థం జరపాలని మొదట నిర్ణయించారు. బహిరంగ ప్రదేశంలో ఆకర్షణీయమైన లైటింగ్, వెన్నెల కాంతుల్లో స్టేజ్‌తో ప్రత్యేక వాతావరణం సృష్టించాలనే ప్రణాళిక వేశారు. కానీ, తుఫాన్ ప్రభావంతో నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆ ఏర్పాట్లు తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. వాతావరణం అనుకూలిస్తే వేడుకను అవుట్‌డోర్‌లోనే నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ, వర్షం కొనసాగితే సన్నిహిత బంధువుల సమక్షంలో ఇంట్లో సాదాసీదాగా నిశ్చితార్థం జరగవచ్చని సమాచారం. ఈ వేడుకకు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి కుటుంబం, అలాగే నైనికా కుటుంబ సభ్యులు మాత్రమే హాజరుకానున్నారు.
వివరాలు
జంట చాలా చక్కగా ఉంది.. శిరీష్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్
ఇటీవల శిరీష్ తన ప్రియురాలు నైనికా పేరును ప్రకటించినప్పటికీ, ఆమె ముఖాన్ని చూపించలేదు. అయితే దీపావళి సందర్భంగా జరిగిన కుటుంబ వేడుకలో, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి అనుకోకుండా నైనికా ఫోటోను పోస్ట్ చేయడంతో, ఆమె ముఖం బయటపడింది. ఆ ఫోటో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తరువాత స్నేహా ఆ పోస్టును తొలగించినా, అప్పటికే పలువురు స్క్రీన్‌షాట్లు తీసి ఆ ఫోటోను విస్తృతంగా పంచుకున్నారు. సోషల్ మీడియాలో చాలామంది "జంట చాలా చక్కగా ఉంది", "శిరీష్‌కు పర్ఫెక్ట్ మ్యాచ్" వంటి కామెంట్లు చేస్తున్నారు.