Telangana: తెలంగాణ రాజ్‌భవన్ పేరు మార్పు .. ఇక లోక్‌భవన్!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా రాజ్‌భవన్ పేరును లోక్‌భవన్‌గా మార్చింది. కేంద్ర ప్రభుత్వం సూచనలను అనుసరిస్తూ, అన్ని రాష్ట్రాల రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌గా మార్చాలని చెప్పిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. వలసవాద భావాలను తగ్గించడానికి, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లకు రాసిన లేఖ ప్రకారం, రాజ్‌భవన్, రాజ్‌నివాస్‌ల పేర్లను లోక్‌భవన్, లోక్‌నివాస్‌లుగా మార్చే అంశాన్ని పరిశీలించమని సూచించింది. ఈ సూచనల మేరకు ఇప్పటికే పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, అస్సాం, కేరళ, త్రిపుర, ఒడిశా రాష్ట్రాల్లో రాజ్‌భవన్‌లను లోక్‌భవన్‌లుగా మార్చారు. తాజాగా, తెలంగాణ కూడా ఈ జాబితాలో చేరింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రాజ్‌భవన్ పేరు లోక్‌భవన్‌గా మార్పు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
— Telugu Stride (@TeluguStride) December 2, 2025
రాజ్‌భవన్ పేరు లోక్‌భవన్‌గా మార్పు
పీఎంవో పేరును సేవాతీర్థ్‌గా నామకరణం#RajBhavan #LokBhavan pic.twitter.com/gjFQsNKrxM