benne dosa recipe: ఎర్రగా.. కరకరలాడుతూ.. బెంగళూరు స్టైల్‌లో 'బెన్నె దోసె' తయారు చేసే విధానం తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
దోసెలంటే అందరికీ ఇష్టం. ఒకేలా కనిపించినా వాటి రుచి, రంగు, తయారీ విధానం ఒక్కో దోసెకు ఒక్కోలా ఉంటుంది. అలాంటి ప్రత్యేకత కలిగిన దోసెల్లో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయినది బెన్నె దోసె. ఎర్రగా, బయట కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ దోసెను ఇంట్లోనూ చాలా ఈజీగా తయారు చేయవచ్చు. సరైన పదార్థాలు, పద్ధతిని పాటిస్తే రెస్టారెంట్ స్టైల్ బెన్నె దోసె మీ వంటింట్లోనే సిద్ధమవుతుంది.
Details
కావాల్సిన పదార్థాలు
దోసె పిండి కోసం ఇడ్లీ బియ్యం - 2 కప్పులు రేషన్ బియ్యం / దోసెల బియ్యం - అర కప్పు మినప్పప్పు - అర కప్పు మెంతులు - 1 టేబుల్ స్పూన్ అటుకులు - పావు కప్పు పంచదార - చిటికెడు ఉప్పు - రుచికి సరిపడా చట్నీ కోసం పల్లీలు - అర కప్పు పచ్చిమిర్చి - 5 అల్లం - కొద్దిగా వెల్లుల్లి - 5 రెబ్బలు ఉల్లిపాయ - 1 కొత్తిమీర - కొద్దిగా కొబ్బరి ముక్క - చిన్న ముక్క చింతపండు - కొద్దిగా పుట్నాలు - 3 టేబుల్ స్పూన్లు
Details
తాలింపు కోసం
నూనె - 1 స్పూన్ ఆవాలు - అర స్పూన్ జీలకర్ర - అర స్పూన్ మినప్పప్పు - 1 స్పూన్ పచ్చిశనగపప్పు - 1 టేబుల్ స్పూన్ ఎండుమిర్చి - 2 కరివేపాకు - 1 రెమ్మ
Details
తయారీ విధానం
ముందుగా దోసె పిండికి అవసరమైన ఇడ్లీ బియ్యం (2 కప్పులు), రేషన్ బియ్యం (అర కప్పు) తీసుకుని రెండు మూడు సార్లు శుభ్రం చేసుకోవాలి. తర్వాత నిండా నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో మినప్పప్పు, మెంతులు వేసి శుభ్రం చేసి నీళ్లు పోసి సుమారు 5 గంటలు నానబెట్టాలి. అలాగే పావు కప్పు మందపాటి అటుకులు తీసుకుని 10 నిమిషాలు నీళ్లలో నానబెట్టుకోవాలి. నానబెట్టిన మినప్పప్పు, మెంతులు, అటుకులను మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత అదే జార్‌లో నానబెట్టిన ఇడ్లీ బియ్యం వేసి, అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం బరకగా గ్రైండ్ చేయాలి.
Details
తయారీ విధానం1/2
ఇలా గ్రైండ్ చేసిన రెండు పిండి మిశ్రమాలను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని బాగా కలిపి **రాత్రంతా ఫర్మెంటేషన్ కోసం పక్కన పెట్టాలి. ఉదయం పిండిలో కొద్దిగా నీళ్లు, చిటికెడు పంచదార, రుచికి సరిపడా ఉప్పు కలిపి దోసె పిండి సిద్ధం చేసుకోవాలి. స్టవ్‌పై ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత గరిటెతో పిండి తీసుకుని దోసె వేసుకోవాలి. పైన బటర్ అప్లై చేసి సన్నటి మంటపై కాల్చితే బెన్నె దోసె ఎర్రగా, క్రిస్పీగా తయారవుతుంది.
Details
చట్నీ తయారీ విధానం
ముందుగా కడాయిలో పల్లీలు, పచ్చిమిర్చి వేర్వేరుగా నూనె లేకుండా వేయించి పక్కన పెట్టాలి. తర్వాత అదే కడాయిలో కొద్దిగా నూనె వేసి అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అనంతరం కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, రెండు రెబ్బల చింతపండు, కొద్దిగా పుట్నాలు వేసి స్వల్పంగా వేయించి చల్లార్చుకోవాలి. తాలింపు కోసం మరో ప్యాన్‌లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. చల్లార్చుకున్న పల్లీలు, ఉల్లిపాయ మిశ్రమాన్ని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని, చివరగా పోపు వేసి కలిపితే రుచికరమైన బెంగళూరు స్టైల్ చట్నీ సిద్ధం.