Page Loader
మీ వయసు 30కి దగ్గరవుతుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు 
మీ వయసు 30కి దగ్గరవుతుంటే మీరు నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు

మీ వయసు 30కి దగ్గరవుతుంటే మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన పాఠాలు 

వ్రాసిన వారు Sriram Pranateja
Jun 19, 2023
03:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

జీవితంలో అనేక దశలుంటాయి. ఒక్కో దశలో ఒక్కోలా ఉంటారు. పదేళ్ళ పిల్లాడిగా ఉన్నప్పుడు, 20ఏళ్ల కుర్రాడిగా ఉన్నప్పుడు ఆలోచనలు ఒకేలా ఉండవు. వయసు పెరుగుతున్న కొద్దీ ఆలోచనలు మారుతుంటాయి. మీ వయసు 30కి దగ్గరవుతుంటే మీరు కొన్ని జీవిత పాఠాలు నేర్చుకోవాలి. 30ఏళ్ళు నిండకముందే నేర్చుకుంటే చాలా మంచిది. ఆ పాఠాలేంటో చూద్దాం. నో చెప్పడం నేర్చుకోండి: అవతలి వాళ్ళను నిరాశ పర్చకూడదనే ఉద్దేశ్యంతో నో చెప్పడానికి చాలామంది ఇబ్బంది పడతారు. మీరు ఆల్రెడీ ఏదో పనిలో ఉండగా, మీ టైమ్ కావాలని వేరే వాళ్ళు అడిగినపుడు మీ పని పూర్తి కావాలంటే ఖచ్చితంగా మీరు వాళ్ళకు నో చెప్పాలి. లేదంటే ఆ తర్వాత వచ్చే ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Details

ఒక్కొక్కరు ఒక్కోలా కనిపించే ప్రపంచం 

మీకంటే విభిన్నంగా ఉన్నవారిని గౌరవించండి: మనుషులందరూ ఒకేలా ఉండరు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. ప్రతీ ఒక్కరూ మీలా ఆలోచించాలని అనుకోకూడదు. నువ్వు చూడని విధానంలో వాళ్ళు ప్రపంచాన్ని చూస్తుంటారు కావచ్చు. కాబట్టి వాళ్ళను గౌరవించు. డబ్బును మేనేజ్ చేయడం తెలుసుకోండి: ఇరవైల్లో ఉండగా స్వేఛ్ఛగా ఖర్చు పెట్టేస్తారు. కానీ 30కి దగ్గరవుతుంటే డబ్బు పట్ల ఒక అవగాహన రావాలి. డబ్బును ఎలా మేనేజ్ చేయాలి? ఎలా పొదుపు చేయాలో మీకు తెలిసి ఉండాలి. అడగడం నేర్చుకోవాలి: నీకేమీ కావాలో నువ్వు అడగడం నేర్చుకోవాలి. మార్కెట్ లో డిస్కౌంట్ అయినా, మీ సహోద్యోగుల నుండి చిన్న హెల్ప్ అయినా అడగడం నేర్చుకోవాలి. అడక్కపోతే ఎవ్వరూ నీక్కావాల్సింది ఇవ్వరు.