పంది మాంసంతో 17అడుగుల టర్కీ బేకన్ తయారు చేసిన లెబనాన్ కంపెనీ: గిన్నిస్ రికార్డ్స్ లో చోటు
పంది మాంసంతో తయారయ్యే టర్కీ బేకన్ అనే ఆహారాన్ని 17అడుగుల పొడవు తయారు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. లెబనాన్ కు చెందిన గాడ్షల్ అనే కంపెనీ, ఈ టర్కీ బేకన్ ని తయారు చేసింది. ఈ బేకన్ ను తయారు చేయడానికి 6గంటల సమయం పట్టినట్లు గాడ్షల్ ప్రెసిడెంట్ రాన్ గాడ్షల్ చెప్పుకొచ్చారు. మొదటగా 25అడుగుల బేకన్ తయారు చేయాలని రాన్ గాడ్షల్ అనుకున్నారట. ఈ బేకన్ పొడవును కొలిచిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారి, 17 అడుగుల 3/4అంగుళాలు ఉందని, గతంలో రికార్డ్ సాధించిన 16.6 అడుగుల దానికంటే పెద్దగా ఉందని చెప్పుకొచ్చారు.
బేకన్ ని క్రైస్తవ మిషనరీలకు పంచిన కంపెనీ
గతంలో దానికంటే ఎక్కువ పొడవు ఉండటంతో గిన్నిస్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది. ప్రస్తుతం ఈ బేకన్ గురించి ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. అయితే ఇంత పెద్ద బేకన్ ని ఏం చేసారన్న ఆలోచన చాలామందికి వస్తుంది. ఈ బేకన్ లోని కొంత భాగాన్ని చిన్నగా ముక్కలు కత్తిరించి ప్రత్యేక లంచ్ ఏర్పాటు చేసారు. మిగిలిన భాగాన్ని క్రైస్తవ మిషనరీలకు అందించారు. ఈ బేకన్ కు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్ లో లభ్యమవుతున్నాయి.