
Eco friendly Diwali: ప్రకృతి పట్ల ప్రేమ చూపించి 'దీపావళి' చేసుకుందాం.. ఈ చిట్కాలను పాటించండి
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ప్రముఖ పండుగలలో దీపావళి ఒకటి.
చీకటిపై వెలుగు సాధించిన విజయానికి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళి పండుగను జరుపుకోవడం అనవాయితీ.
దీపం వెలిగించడం, టపాసులు పేల్చడం ఈ వేడుకల్లో భాగం. దీపావళి సమయంలో వాయుకాలుష్యం పెరిగి, పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది.
ఈ నేపథ్యంలో దీపావళిని ఎకో ఫ్రెండ్లీగా జరుపుకోవడం మీద మరింత అవగాహన పెరుగుతోంది. దీనిపై కొన్ని చిట్కాలను ఇప్పుడు తెలుసుందాం.
Details
ప్లాస్టిక్ వాడవద్దు
సహజ పదార్థాలు
ఇంటి అలంకరణకు ప్లాస్టిక్ లేదా సింథటిక్ పదార్థాలు వాడకండి. సహజ, బయోడిగ్రేడబుల్ ఉత్పత్తులను ఎంచుకోండి.
సాంప్రదాయ మట్టి దీపాలు
మట్టి దీపాలను కొనుగోలు చేయడం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చు. ఇవి అందంగా ఉంటాయి.
అలంకరణకు పువ్వులు
తాజా పువ్వులు, ఆకులను ఇంటిలో అలంకరించడానికి ఉపయోగించండి. బంతిపూలు, గులాబీలు, మల్లె వంటి పువ్వులు అందంగా కనిపిస్తాయి.
తోరణాలు
పాత క్లాత్‌ను ఉపయోగించి సహజ లేదా రీసైకిల్ చేసిన తోరణాలను తలుపుకు అలంకరించండి. ప్లాస్టిక్ తోరణాలు వాడకండి.
Details
సోలార్ లైట్ల వాడకం
ఎలక్ట్రిక్ వినియోగం తగ్గించండి
మీ తోట లేదా బాల్కనీలో సోలార్ లైట్లు ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించవచ్చు.
సేంద్రీయ రంగులు
రసాయన రంగుల బదులు పసుపు, కుంకుమ, గోరింటాకు పొడి వంటి సహజ రంగులను ఉపయోగించి రంగోలి తయారు చేయండి.
బహుమతులు
మొక్కలు, చేతితో తయారు చేసిన సబ్బులు, వంటకాలు, స్వీట్లు వంటి ఎకో ఫ్రెండ్లీ బహుమతులు ఇవ్వండి.
గ్రీన్ క్రాకర్స్
తక్కువ పొగ, శబ్దం కలిగించే క్రాకర్లను ఎంచుకోండి. భూ చక్రం, చిచ్చుబుడ్డీ వంటి టపాసులు వినియోగించండి.
ఈ చిట్కాలను పాటిస్తూ, దీపావళిని ఆరోగ్యంగా జరుపుకోండి.