LOADING...
Lionel Messi: లగ్జరీ జెట్‌లో భారత్‌కు లియోనెల్ మెస్సీ.. దాని ధర ఎంతో తెలిస్తే  షాక్ అవుతారు!
లగ్జరీ జెట్‌లో భారత్‌కు లియోనెల్ మెస్సీ.. దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

Lionel Messi: లగ్జరీ జెట్‌లో భారత్‌కు లియోనెల్ మెస్సీ.. దాని ధర ఎంతో తెలిస్తే  షాక్ అవుతారు!

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఫుట్‌ బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ GOAT ఇండియా టూర్ 2025లో భాగంగా భారత్‌కు వచ్చారు. డిసెంబర్ 13న ఆయన కోల్‌కతా విమానాశ్రయానికి చేరుకున్నారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య మెస్సీ రావడం ఒక ఎత్తయితే, ఆయన వచ్చిన లగ్జరీ ప్రైవేట్ జెట్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించింది. వైట్ టీ-షర్ట్‌పై బ్లాక్ సూట్ వేసుకుని, స్టైలిష్‌గా జెట్ నుంచి దిగిన మెస్సీ అభిమానులను ఉర్రూతలూగించారు. బయట నుంచి ఒక్కసారి చూసినా అది అతి విలాసవంతమైన జెట్ అన్న విషయం అర్థమవుతుంది. ఈ ప్రైవేట్ జెట్ పేరు 'గల్ఫ్‌స్ట్రీమ్ GV'. ఇది సూదూర ప్రయాణాలకు ఉపయోగించే ప్రత్యేక బిజినెస్ జెట్. మెస్సీ అవసరాలకు అనుగుణంగా దీనిని పూర్తిగా కస్టమైజ్ చేశారు.

వివరాలు 

విలాసవంతమైన ఈ జెట్ ధర ఎంత ఉంటుందో తెలుసా?

ఈ జెట్‌లో మొత్తం 14 రిక్లైనింగ్ సీట్లు,6 బెడ్లు,2 బాత్‌రూమ్‌లు,అలాగే వంటగది ఉన్నాయి. గంటకు సుమారు 1050 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణించగలదు.అంతేకాదు, 51,000 అడుగుల ఎత్తులో ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో, విమాన రద్దీని తప్పించుకుని న్యూయార్క్ నుంచి టోక్యో, లేదా లండన్ నుంచి సింగపూర్ వరకు ఆగకుండా ప్రయాణించగలదు. మెస్సీతో పాటు ఆయన టీమ్‌కు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలు ఈ జెట్‌లో ఏర్పాటు చేశారు. సౌకర్యం,విశ్రాంతి రెండింటికీ పెద్దపీట వేశారు. ఇంత విలాసవంతమైన ఈ జెట్ ధర ఎంత ఉంటుందో తెలుసా? స్పానిష్ వార్తాపత్రికల కథనాల ప్రకారం,మెస్సీ ఈ గల్ఫ్‌స్ట్రీమ్ V జెట్‌ను 15 మిలియన్ డాలర్లకు,అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 135.8 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు.

వివరాలు 

మెస్సీ దగ్గర మరో రూ.317 కోట్ల విమానం కూడా!

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇదొక్కటే కాదు. మెస్సీ వద్ద ఇప్పటికే మరో ప్రైవేట్ జెట్ కూడా ఉంది. అది ఎంబ్రేయర్ లెగసీ 650, దీని ధర సుమారు 35 మిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 317 కోట్లు. మెస్సీ జెర్సీ నంబర్ '10' జెట్ టెయిల్‌పై ప్రత్యేకంగా డిజైన్ చేశారు. అలాగే, విమానం ఎక్కే మెట్లపై ఆయన భార్యతో పాటు ముగ్గురు పిల్లల పేర్ల మొదటి అక్షరాలు కనిపిస్తాయి.

Advertisement

వివరాలు 

విడా జెట్స్ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో జెట్ ఇంటీరియర్ వివరాలు 

సెలబ్రిటీలకు, ధనవంతులకు లగ్జరీ ప్రయాణాలు అందించే విడా జెట్స్ అనే సంస్థ తమ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ జెట్ ఇంటీరియర్ వివరాలను షేర్ చేసింది. మెస్సీకి పూర్తి విశ్రాంతి, అత్యంత సౌకర్యం అందేలా లోపలి డిజైన్ రూపొందించామని పేర్కొంది. అంతేకాదు, "లియోనెల్ మెస్సీకి ప్రతి ఫ్లైట్ ఒక ప్రయాణమే కాదు... అది ఏకాగ్రత, సమతుల్యత, ప్రశాంతతకు సంబంధించిన ఒక ప్రత్యేక క్షణం" అని కూడా వ్యాఖ్యానించింది.

Advertisement