Lizards Avoiding Tips : ఇంట్లో బల్లులు ఇబ్బందిపెడుతున్నాయా.. అయితే ఇవి పాటిస్తే అవి పారిపోతాయి
మనం ఎంతో ఇష్టంగా ఇళ్లు కట్టుకుంటాం. మరికొందరు ఏవేవో డిజైన్లు చేయిస్తుంటారు ఫాల్స్ సీలింగ్ వంటివి. అయినా సరే ఇంట్లో తరచుగా అందరినీ ఇబ్బంది పెడుతుంటాయి బల్లులు. ఈ మేరకు చాలా మందికి బల్లి అంటే భయం ఏర్పడింది. గోడ మీద ఉంటే ఎక్కడ మీద పడుతుందోనని ఆందోళన ఉంటుంది. వంటగది, ఇంటి గోడలపై బల్లులు పాకడం మనకు చికాకు కలిగిస్తుంది. ష్.. ష్ అంటూ అరుస్తుంటాం. ఎంత అరిచినా, గీ పెట్టినా అవి ఒక పట్టాన కదలవు. కొన్నిసార్లు అనుకోకుండానే అవి మీద పడుతుంటాయి. ఇలాంటి పరిస్థితిలో చాలా మంది బల్లులను చంపాలని అనుకుంటుంటారు. కానీ దీనికి శకునం ఉంటుందని పెద్దలు అంటుంటారు కాబట్టి ఎవరూ దాన్ని చంపే సాహసం చేయలేరు.
వంటగది, కిటికీ, గోడ, ఇంటి మూలల్లో బల్లులు ఎక్కువగా తిష్ట వేస్తాయి.
దీంతో మంచి, చెడు రెండూ ఉంటాయని చాలా మంది విశ్వసిస్తారు. కానీ వీటిని శాశ్వతంగా ఇంట్లో నుంచి పంపించేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. వంటగది, కిటికీ, గోడ, ఇంటి మూలల్లో బల్లులు ఎక్కువగా తిష్ట వేస్తాయి. అలాంటి స్థలాలను గుర్తించి అక్కడ ఉల్లిపాయ, వెల్లుల్లిని కోసి పెట్టాలి. బల్లులు వాటి వాసనను ఇష్టపడవు కనుక అది అక్కడికి రాదు. గుడ్డు వాడుకున్న తర్వాత వాటిపై పెంకుల్ని పడేయకుండా బల్లులు తిరిగే ప్రదేశాల్లో పెంకులను వేలాడదీయాలి. బల్లులకు గుడ్డు పెంకు వాసన నచ్చక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. నిమ్మరసంతోనూ బల్లులను పొగొట్టేందుకు వీలుంది. ఓ చిన్న డబ్బాలో నిమ్మరసం పిండి నాలుగు వెల్లుల్లి రెబ్బలు, సగం ఉల్లిపాయను బాగా చూర్ణం చేసి అందులో వేయాలి.
ఏసీతోనూ బల్లులను తరుమొచ్చుే
తర్వాత ఓ గుడ్డతో రసాన్ని తీసి మీ దగ్గర పుదీనా ఉంటే ఆ ఆకులను కూడా వేసుకోవచ్చు. ఈ రసాన్ని ఒక సీసాలో వేసి బల్లి ఎక్కువ తిరిగే ప్రదేశంలో స్ప్రే చేయాల్సి ఉంటుంది. లేదా టిష్యూ పేపర్‌కు అంటించి బల్లి ఉండే ప్రదేశంలో ఉంచితే అది రాకుండా ఉంటుంది. ఇలా చేస్తే బల్లులు తిరిగి అటు వైపు రావు.ఇలా వారానికి రెండు సార్లు చేయొచ్చు. మరోవైపు బ్లాక్ పెప్పర్ స్ప్రేని బల్లులు తిరిగే ప్రదేశంలో కొట్టడం వల్ల అవి రాకుండా ఉంటాయి. ఇది ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా బయట కొనుక్కోవచ్చు. మీ ఇంట్లో AC ఉంటే, బల్లులను తరిమికొట్టేందుకు ఉష్ణోగ్రతను తగ్గించాలి.బల్లులకు చల్లని వాతావరణం నచ్చదు కాబట్టి అవి పారిపోతాయి.