Heart attack: దంతాలు కోల్పోయిన వ్యక్తులకు గుండెపోటు
దంతాలు కోల్పోయిన ఎక్కువ మంది వ్యక్తుల్లో గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఇటీవల ఓ అధ్యయనం స్పష్టం చేసింది. . ఒకటి లేదా అంతకంటే ఎక్కువ దంతాలను కోల్పోతే గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు. దంతాలను కోల్పోవడం, నోటి పరిశుభ్రత సరిగా లేకపోవడం వల్ల హానికరమైనక్రిములు చిగుళ్లలోకి చొచ్చుకుపోయి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత అవి గుండెను ప్రభావితం చేసి, ఇన్ఫెక్షన్‌లకు దారితీస్తుందని పేర్కొంది.
దంతాలు కోల్పోయిన వారిలో 66శాతం ఎక్కువ
ధూమపానం, వ్యాయామ అలవాట్లు, కొలెస్ట్రాల్ స్థాయిలు, మధుమేహం, రక్తపోటు వంటి ఇతర కారణాలు వల్ల కూడా గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. ఒహియోలోని కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీలో ఎండోడాంటిస్ట్, దంత పరిశోధకురాలు అనితా అమినోషారియా నేతృత్వంలోని ఇటీవల ఓ అధ్యయనం చేసింది. మొత్తం దంతాలు కోల్పోయిన వ్యక్తులు గుండె సంబంధిత సమస్యలతో మరణించే ప్రమాదం 66శాతం ఎక్కువగా ఉందని విశ్లేషణ వెల్లడించింది.