LOADING...
Sankranti 2026: మకర సంక్రాంతి.. జనవరి 14 నుంచి 15కి ఎందుకు మారింది? దీని వెనుక ఉన్న ఆసక్తికర సైన్స్ ఏంటంటే..
దీని వెనుక ఉన్న ఆసక్తికర సైన్స్ ఏంటంటే..

Sankranti 2026: మకర సంక్రాంతి.. జనవరి 14 నుంచి 15కి ఎందుకు మారింది? దీని వెనుక ఉన్న ఆసక్తికర సైన్స్ ఏంటంటే..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 15, 2026
09:26 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలుగు ప్రజలకు అత్యంత ప్రియమైన పండుగ సంక్రాంతి. దశాబ్దాలుగా మనం జనవరి 14వ తేదీని సంక్రాంతి పండుగగా జరుపుతూ వచ్చాం. అయితే, ఇటీవల కొన్ని సంవత్సరాలుగా, సంక్రాంతి జనవరి 15వ తేదీ రావడాన్ని మనం గమనించవచ్చు. మన దేశంలో అనేక పండుగలు చంద్రుడి గమనం (చాంద్రమానం) ప్రకారం మారుతూ ఉంటాయి, కానీ సంక్రాంతి సూర్యుని గమనం (సౌరమానం) ఆధారంగా ఉంటుంది. మరి ఇలాంటి పండుగ తేదీ ఎందుకు మారుతోందో తెలుసా? దీని వెనుక ఒక ఆసక్తికరమైన ఖగోళ కారణం ఉంది.

వివరాలు 

 72సంవత్సరాలకు ఒకసారి పండుగ తేదీ ఒక రోజు ముందుకు మారుతుంది 

భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమంలో, భూమి కక్ష్యలో చిన్న చిన్న తేడాలు వస్తాయి. భూమి తన అక్షంపై తిప్పుకుంటూ, స్వల్పంగా దిశ మార్చడం వలన,సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం ప్రతి ఏడాదికి సుమారు 20నిమిషాలు ముందుకి వెళ్తుంది. ఈ చిన్న వ్యత్యాసం సగటుగా 72సంవత్సరాలకు ఒకసారి పండుగ తేదీ ఒక రోజు ముందుకు జరుగుతుంది. దీన్ని ఆధారంగా చూస్తే,1935 నుండి 2007 వరకు సంక్రాంతి జనవరి 14న జరుపుకుంటూ వుంది. కానీ 2008 నుంచి ఈ పండుగ జనవరి 15కి మారింది.ఈ లెక్క ప్రకారం,2080 వరకు మనం జనవరి 15నే సంక్రాంతిని జరుపుకుంటాము. ఆ తరువాత, అంటే 2081 నుండి,సంక్రాంతి జనవరి 16కి మారే అవకాశం ఉంది.

వివరాలు 

గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దుల కోలాహలం

ఇలాంటి సందర్భంలో, ఈ ఏడాది కూడా జనవరి 15వ తేదీన, తెలుగు రాష్ట్రాలలో మకర సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకోనున్నారు. పల్లె ప్రాంతాల్లో గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దుల కోలాహలంతో పండుగ సందడి నెలకొంటుంది. "తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ, పల్లెటూరి పవర్ చూపిస్తూ, సంక్రాంతి పండుగను సంబరంగా జరుపుకోండి. మీ కుటుంబ సభ్యులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు 2026!"

Advertisement