Rangoli Colours: సంక్రాంతి ముగ్గుల కోసం ఇంట్లోనే రంగులు సులభంగా తయారు చేసుకోండి
ఈ వార్తాకథనం ఏంటి
సంక్రాంతి పండుగ మూడు రోజుల పాటు ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేయాలని అనుకుంటే, అందమైన రంగులు తప్పనిసరి. కానీ మార్కెట్‌లో రంగులు కొనడం కొంచెం ఖర్చుతో కూడుకుంది.
అందుకే ఇంట్లోనే సులభంగా రంగులు తయారు చేసుకోవడం చాలా మంచి ఆలోచన.
అదీ కేవలం ఇంట్లో లభించే రెండు వస్తువులతో! ఈ ప్రక్రియ ఎంతో ఈజీగా ఉంటుంది. రేషన్ బియ్యంతో ఇంట్లోనే రంగులు ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం.
రంగులు తయారు చేయడానికి కావలసిన సామాగ్రి
1. దొడ్డు బియ్యం (రేషన్ బియ్యం)
2. కడాయి
3. రంగులు కలపడానికి కావాల్సిన బౌల్స్
4. వాటర్ కలర్స్ లేదా అక్రిలిక్ పెయింట్స్
Details
రంగులు తయారు చేసే విధానం
1. బియ్యం వేయడం
ముందుగా రేషన్ బియ్యం తీసుకుని కడాయిలో వేసి దోరగా వేయించాలి.
2. పిండిగా తయారు చేయడం
వేయించిన బియ్యం చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పిండిలా పట్టాలి. బియ్యం మరీ మెత్తగా కాకూడదు, అలాగే రవ్వలా కూడా ఉండకూడదు.
ఎందుకంటే చాలా మెత్తగా ఉంటే రంగులు వేయడం కష్టం అవుతుంది, రవ్వలా ఉంటే ముగ్గు అందంగా కనిపించదు.
3. బౌల్స్‌లో పిండి పోయడం
ఇప్పుడు మీకు కావలసిన రంగుల సంఖ్యకు తగినంతగా బౌల్స్ తీసుకుని అందులో పిండిని వేసుకోండి.
4. కలర్స్ కలపడం
బౌల్స్‌లోని పిండికి కావలసిన రంగులను వేసి కలపండి. ఇందుకు అక్రిలిక్ పెయింట్స్ లేదా వాటర్ కలర్స్ ఉపయోగించండి.
Details
సంక్రాంతికి ముగ్గుల ప్రత్యేకత
5. ఆరనివ్వడం
కలిపిన రంగులను కొద్దిసేపు ఆరనివ్వాలి.
6. మరోసారి మిక్సీలో తిప్పడం
రంగులు చక్కగా ఆరిన తర్వాత మిక్సీలో మరోసారి తిప్పండి. ఇలా చేయడం వల్ల రంగు పిండిలో పూర్తిగా కలిసిపోతుంది.
ఈ విధానంతో మీకు కావలసినన్ని రంగులు తయారు చేసుకోవచ్చు. దొడ్డు బియ్యం ఇంట్లో ఉండే సాధారణ వస్తువు కావడం వల్ల అదనపు ఖర్చు అవసరం ఉండదు.
ఇక వాటర్ కలర్స్ లేదా అక్రిలిక్ పెయింట్స్ లేకపోతే కూడా వాటిని తక్కువ ఖర్చులో కొనుగోలు చేయవచ్చు.
ఇలా తయారు చేసుకున్న రంగులతో మీ పండుగ ముగ్గులు మరింత అందంగా ఉంటాయి. పండుగ వాతావరణంలో ఆర్థిక వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.