Winter Diet: శీతాకాలంలో రోగనిరోధకత పెంచే డైలీ రూటీన్
ఈ వార్తాకథనం ఏంటి
చలికాలంలో ఆరోగ్యంగా ఉండడం చాలా అవసరం. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే వివిధ రోగాలు దాడి చేస్తాయి. కాబట్టి ఈ సీజన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజువారీ అలవాట్లలో కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం మంచిది. ఇవి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. ఉదయం ఉసిరి రసం తాగడం శీతాకాలంలో ఎంతో ప్రయోజనకరం. ఉసిరిలో విటమిన్-సి అధికంగా ఉండటం వల్ల శరీర రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ప్రతిరోజూ ఉదయం ఉసిరి జ్యూస్‌తో రోజు ప్రారంభిస్తే అనారోగ్యాలు దూరంగా ఉంటాయి.
వివరాలు
గోరువెచ్చని నీటిలో నెయ్యి..
గోరువెచ్చని నీటిలో నెయ్యి కలిపి తాగడం కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది శరీర రోగనిరోధకతను బలపరచటమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. అందువల్ల ఉదయం ఒక చెంచా నెయ్యిని గోరువెచ్చని నీటిలో కలిపి తాగడం అలవాటు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు 5 బాదంపప్పులను నీటిలో నానబెట్టాలి. ఉదయం అల్పాహారానికి కొంతసేపు ముందు ఈ నానబెట్టిన బాదంపప్పులను తింటే శరీరం మరింత ఆరోగ్యవంతంగా ఉంటుంది. ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి రోజంతా సమయం దొరికినప్పుడల్లా తింటూ ఉండటం కూడా ఆరోగ్యానికి ఉపయోగకరం. ఇది శరీరాన్ని దృడంగా ఉంచడమే కాకుండా ఎన్నో చిన్న ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.