వర్షాకాలంలో మీ ఇంటి గార్డెన్ ని అందంగా మార్చే పూల మొక్కలు
మీ బాల్కనీలో రకరకాల పూల మధ్య కూర్చుని కాఫీ తాగుతుంటే ఆ మజానే వేరు. పూల నుండి వచ్చే పరిమళం, కాఫీ నుండి వచ్చే వాసన మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ వర్షాకాలంలో మీ ఇంటి గార్డెన్ ని అందంగా మార్చుకోవాలంటే ఎలాంటి పూలమొక్కలు పెంచుకోవాలో చూద్దాం. ముద్ద గోరింత(బల్సం): ఈ పువ్వులు గులాబీ, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉంటాయి. వర్షాలు పడటం మొదలైనప్పుడు ఈ మొక్కలను నాటాలి. నీళ్ళు నిలిచిపోయే మట్టిలో కాకుండా ఎండిపోయే మట్టిలో ఈ మొక్కలు నాటాలి. పోకబంతి: గులాబీ, తెలుపు, లావెండర్ రంగుల్లో ఉండే ఈ పూల మొక్క వర్షాకాలం బాగా పెరుగుతుంది. ఎండ ఎక్కువ పడకపోయినా ఈ మొక్క పెరుగుతుంది.
నీళ్ళు ఎక్కువ తాగని పూల మొక్కలు
కాస్మోస్: గులాబీ, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండే ఈ పూల మొక్కలను వర్షాకాలం మొదలవగానే నాటాల్సి ఉంటుంది. ఈ మొక్కలకు ఎక్కువ నీళ్ళు అందివ్వకూడదు. ఎక్కువ నీళ్ళు అందిస్తే వాటి వేర్లు చెడిపోయి మొక్క పాడవుతుంది. సాల్వియా: ఈ పూల మొక్కలను సులభంగా పెంచవచ్చు. వీటిని మెయింటైన్ చేయడం చాలా సులభం. కంపోస్ట్ ఎరువును ఈ మొక్కకు వేస్తే బాగుంటుంది. ఎక్కువ నీళ్ళు అందించవద్దని తెలుసుకోండి. బంగాళా బంతి(జిన్నియా): ఎరుపు, నారింజ, గులాబీ, పసుపు రంగుల్లో దొరికే ఈ పూలమొక్కను సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో పెంచాలి. ఈ మొక్కలను పెంచేవారు మూడు వారాలకోసారి ఎరువును వేయాలి.