LOADING...
Malai Laddu: కమ్మటి రుచితో మైమరపించే మలై లడ్డూలు.. ఇంట్లో చేస్తే షాప్‌ స్వీట్లే మరిచిపోతారు!
కమ్మటి రుచితో మైమరపించే మలై లడ్డూలు.. ఇంట్లో చేస్తే షాప్‌ స్వీట్లే మరిచిపోతారు!

Malai Laddu: కమ్మటి రుచితో మైమరపించే మలై లడ్డూలు.. ఇంట్లో చేస్తే షాప్‌ స్వీట్లే మరిచిపోతారు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 23, 2025
05:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇతర స్వీట్ రెసిపీలతో పోలిస్తే లడ్డూలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ఏ పదార్థంతో చేసినా లడ్డూలకు వచ్చే క్రేజ్‌ అలాంటిదే. సాధారణంగా బూందీ లడ్డూ, మోతీచూర్ లడ్డూ, నువ్వుల లడ్డూ, రవ్వ లడ్డూ వంటి రకాల్ని ఎక్కువగా చేస్తుంటారు. అయితే వీటితో పాటు పాలతో కూడా చాలా సింపుల్‌గా, అప్పటికప్పుడు రుచికరమైన లడ్డూలను తయారు చేసుకోవచ్చు. ఇవి సూపర్ టేస్టీగా ఉండటమే కాకుండా పిల్లలు, పెద్దలు అందరికీ ఇష్టమైన స్వీట్‌గా మారతాయి. ముఖ్యంగా ఈ విధానం బిగినర్స్‌కూ ఈజీగా అర్థమయ్యేలా ఉండటంతో ఎలాంటి కష్టమూ లేకుండా ప్రిపేర్ చేయొచ్చు.

Details

తన

ఇంకా మంచి విషయం ఏంటంటే... ఈ లడ్డూల తయారీకి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. కేవలం ఆరు ఇంగ్రీడియంట్స్‌తోనే స్వీట్ షాప్ స్టైల్ మలై లడ్డూలను పర్ఫెక్ట్ షేప్‌లో, మంచి రుచితో రెడీ చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే పిల్లలే కాదు పెద్దలు కూడా ఒకటికి రెండు అడిగి మరీ తింటారు. ఇంటికి బంధువులు వచ్చినప్పుడు, చిన్నచిన్న వేడుకల్లో ఈ లడ్డూలను తయారు చేసి సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. మరి ఈ సూపర్ టేస్టీ మలై లడ్డూల తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం.

Details

కావాల్సిన పదార్థాలు 

పాలు - 1 లీటర్ పంచదార - 100 గ్రాములు నిమ్మరసం - కొద్దిగా నెయ్యి - తగినంత యాలకుల పొడి - అర టీ స్పూన్ మిల్క్ పౌడర్ - పావు కప్పు

Advertisement

Details

తయారీ విధానం 

ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక లీటర్ పాలు పోయాలి. అందులో 100 గ్రాముల పంచదార వేసి మూడు పొంగులు వచ్చే వరకు మరిగించాలి. తర్వాత మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి మధ్యమధ్యలో కలుపుతూ సుమారు 20 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలపాలి. తర్వాత పావు కప్పు మిల్క్ పౌడర్ వేసి మిక్స్ చేయాలి. ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి, అర టీ స్పూన్ యాలకుల పొడి వేసి మరోసారి కలపాలి. ఈ మిశ్రమాన్ని కడాయి మొత్తానికి సమంగా స్ప్రెడ్ చేసి సుమారు ఐదు గంటల పాటు పక్కన పెట్టాలి.

Advertisement

Details

తయారీ విధానం1/2 

ఐదు గంటల తర్వాత చేతులకు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా లడ్డూలుగా తయారు చేసుకోవాలి. అంతే... నోరూరించే మలై లడ్డూలు రెడీ. ఈ లడ్డూలను ఎయిర్‌టైట్ డబ్బాలో నిల్వ చేస్తే నాలుగు రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఇలా ఇంట్లో తయారు చేసి పెట్టారంటే ఇంటిల్లిపాదీకి ఇవే ఫేవరెట్ స్వీట్‌గా మారుతాయి. ఎక్కువ మోతాదులో లడ్డూలు చేయాలనుకుంటే పాలు, పంచదారతో పాటు మిగతా పదార్థాలను కూడా అదే నిష్పత్తిలో పెంచుకుని ఉపయోగించాలి.

Advertisement