Shocking video Viral: వంటగది వీడియో వైరల్.. అప్రమత్తం అవుతున్న జనం
ఆఫ్రికన్ ప్రజలు భారతీయ స్ట్రీట్ ఫుడ్స్ ను ఎగతాళి చేసిన విషయం తెలిసిందే. దింతో భారతీయులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. అయినా మరో మారు అలాంటి వీడియో సోషల్ మీడియా లో దర్శనమిచ్చింది. దింతో ఇపుడు ప్రజలు ఒకరినొకరు అప్రమత్తం చేసుకోవడం ప్రారంభించారు. హోటళ్లు,రెస్టారెంట్లు,పెళ్లిళ్లలో ఆహార నాణ్యతపై ఇంటర్నెట్‌లో ఈ వీడియో కొత్త చర్చకు దారితీసింది. వైరల్ అయిన వీడియో క్లిప్ వంటగదికి సంబంధించినది. వంటగదిలో కొన్ని ఎలుకలు అటు ఇటు తిరుగుతూ.. పూరి కోసం చేసిన పిండిని ని స్క్రాప్ చేస్తుంటే..మరో పక్కనే ఓ వ్యక్తి కూర్చొని పూరీలు పూరీలు వేయిస్తున్నాడు.
వీడియో చూసి విస్తుపోయిన X వినియోగదారులు
ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. PFC క్లబ్ వ్యవస్థాపకుడు,ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ చిరాగ్ బర్జాత్యా, X లో వీడియోను షేర్ చేశారు. ఎల్లప్పుడూ వివాహ వంటశాలలలో లేదా స్థానిక పంపిణీ ఆహార వ్యవస్థలలో వంటగదిని తనిఖీ చేయండి. ఇది అత్యంత ఆందోళనకరం అంటూ రాసుకొచ్చారు.దీనిని సాధారణ వీడియోగా చూడదన్నారు. అయితే,ఈ వీడియో ఎక్కడిది అనే దానిపై చిరాగ్ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే వీడియో చూసిన తర్వాత చాలా మంది X వినియోగదారులు విస్తుపోయారు. ఈ వీడియో చూసిన తర్వాత కొందరు,ఇది భారతదేశ ప్రతిష్టను మరింత చెడగొడుతుందని అంటున్నారు.
రాజస్థాన్‌లోని కర్ణి మాత ఆలయంలో ఎలుకలు
కానీ చాలా మంది X వినియోగదారులు ఈ వీడియోను రాజస్థాన్‌లోని కర్ణి మాత ఆలయంలో చిత్రీకరించారని పేర్కొన్నారు. దీనిని ఎలుకల దేవాలయం అని కూడా పిలుస్తారని వారు అన్నారు. ఎలుకలు వ్యాధులను వ్యాప్తి చేసి ప్లేగును కలిగిస్తాయి. అయితే అత్యంత తీవ్రమైన ప్లేగుల సమయంలో, ఈ ఆలయ ఎలుకలు కనబడవు. కర్ణి మాత వారసులుగా భావించే ఈ ఎలుకలను పోషించడానికి,పూజించడానికి యాత్రికులు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. మనుషుల అంటే భయం లేకుండా వేల సంఖ్యలో ఎలుకలు ఆలయ సముదాయం చుట్టూ తిరుగుతాయి. ఆలయ పూజారులు కూడా ఎలుకలకు ఆహారం పెడతారు అలాగే వాటిని సంరక్షిస్తారు.