ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్న 14ఏళ్ళ బాలుడు కైరాన్ క్వాజీ
సాధారణంగా ఒక జాబ్ చేయడానికి ఇంత వయసు ఉండాలని చెబుతారు. తక్కువ వయసున్న వారిని ఉద్యోగాల్లోకి తీసుకోరు. కానీ వయసుతో సంబంధం లేకుండా ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కైరాన్ క్వాజీ జాబ్ తెచ్చుకున్నాడు. అవును, స్పేస్ ఎక్స్ లో సెలెక్ట్ అయిన కైరన్, లింక్డ్ ఇన్ లో ఆ విషయాన్ని పంచుకుంటూ, వయసును పట్టించుకోకుండా కేవలం జ్ఞానం ఆధారంగా నన్ను జాబ్ లోకి స్పేస్ ఎక్స్ కంపెనీ తీసుకుందని, ఇలాంటి కంపెనీలు చాలా అరుదుగా ఉంటాయని అన్నాడు. ప్రస్తుతం కైరాన్ పెట్టిన పోస్టు, లింక్డ్ ఇన్ లో వైరల్ గా మారింది. స్పేస్ ఎక్స్ లో జాబ్ తెచ్చుకున్నందుకు అందరూ అతనికి అభినందనలు చెబుతున్నారు.
9ఏళ్ళకే ఇంటర్న్ షిప్ పూర్తి చేసిన కైరాన్
సాంటా క్లారా యూనివర్సిటీ నుండీ డిగ్రీ పూర్తి చేసే పనిలో ఉన్నాడు కైరాన్. మరికొద్ది రోజుల్లో పట్టా పొంది అతి తక్కువ వయసులో డిగ్రీ అందుకున్నవాడిగా కైరాన్ చైరిత్ర సృష్టించనున్నాడు. చిన్నతనం నుండే చురుగ్గా ఉండే కైరాన్, రెండేళ్ల వయసులో పూర్తి వాక్యాలతో మాట్లాడేవాడనీ, ఎక్కడ తడబాటు ఉండేది కాదనీ LA Times రాసుకొచ్చింది. మూడవ తరగతి చదువుతున్నప్పుడు, ఆ పాఠాలు ఛాలెంజింగ్ గా లేవనీ కనుగొన్నాడు. ఆ తర్వాత కొన్నిరోజులకు ఇంటెల్ లాబ్సా కంపెనీలో ఏఐ రీసెర్చ్ మీద ఇంటర్న్ గా చేరాడు. ఆ తర్వాత 11ఏళ్ల వయసులో కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. ప్రస్తుతం స్పేస్ ఎక్స్ లో పనిచేయడానికి కాలిఫోర్నియా నుండి వాషింగ్టన్ కు మారుతున్నాడు.