Meftal : పీరియడ్స్ నొప్పి, తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ మెఫ్తాల్ సురక్షితమేనా
మెఫ్తాల్ అనే నొప్పి నివారణ టాబ్లెట్ అటు పీరియడ్స్ నొప్పి ఇటు తలనొప్పి కోసం వాడే పెయిన్ కిల్లర్ కారణంగా శరీరం సురక్షితమేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. మెఫెనామిక్ యాసిడ్,తరచుగా Meftalగా ఈ గోలిని విక్రయిస్తుంటారు.ఇది సిండ్రోమ్‌తో ఔషధ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఫలితంగా చర్మం దద్దుర్లు, జ్వరం లాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి.ఈగోలి వినియోగిస్తే కొందరిలో తీవ్రమైన అలెర్జీ ప్రతిచర్యగా మారుతుందని నిపుణలు అంటున్నారు. Drug Rash with Eosinophilia and Systemic Symptoms అనే దాన్ని DRESS syndromeగా పిలుస్తారు.కొన్ని రకాల ఔషధాలు పడనప్పుడు ఇలాంటి తీవ్రమైన అలెర్జీకి దారి తీస్తుంది. దీంతో కేంద్రం మెఫ్తాల్ టాబ్లెట్ ప్రతికూల ప్రభావాలపై పునరాలోచిస్తోంది.దీని యోగ్యతను నిశితంగా పరిశీలించాలని వైద్యులతో పాటు రోగులను కోరింది.