మిల్లెట్స్: శరీరానికి ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాలు, వాటి ప్రయోజనాలు
చిరుధాన్యాల్లో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో చిరుధాన్యాలను పండిస్తారు. ఇందులో విటమిన్లు, ఖనిజలవణాలు, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శరీరానికి మంచి ఆరోగ్యం అందుతుంది. భారత ప్రభుత్వం 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో చిరుధాన్యాల వల్ల కలిగే ప్రయోజనాలు, చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరానికి జరిగే మేలు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో దొరికే చిరుధాన్యాల గురించి తెలుసుకుని వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. చిరుధాన్యాల్లో గ్లిసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా డయాబెటిస్ తో బాధపడేవారు చిరుధాన్యాలను ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.
చిరుధాన్యాలు, వాటిలో ఉండే పోషకాలు
సజ్జలు: వీటిలో ప్రోటీన్, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల శరీరానికి మంచి ఆరోగ్యం అందుతుంది. రాగులు: రాగులలో అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. దీనివల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది. కాబట్టి రాగులను ఆహారంలో కచ్చితంగా భాగం చేసుకోవాలి. జొన్నలు: దీనిలో ఐరన్, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఉండడం వల్ల బరువు తగ్గడంలో ఇది సాయపడుతుంది. సామలు: ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి, పొటాషియం, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రైస్ వద్దనుకునే వారికి సామలు మంచి రీప్లేస్మెంట్ గా ఉంటుంది. కొర్రలు: చక్కెర వ్యాధితో బాధపడేవారు కొర్రలు తినడం చాలా మంచిది ఇందులో క్యాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి.