Miss Universe 75th Anniversary Celebration: మిస్ యూనివర్స్ 75వ వార్షికోత్సవం.. సరికొత్త కిరీటం సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
మిస్ యూనివర్స్ పోటీలకు మరో ప్రత్యేకత చేరింది. ఈ ప్రతిష్ఠాత్మక పోటీ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మిస్ యూనివర్స్ ఆర్గనైజేషన్ (MUO) సరికొత్త కిరీటాన్ని అధికారికంగా ఆవిష్కరించింది. ప్యూర్టో రికోలో నిర్వహించిన కార్యక్రమంలో కొత్త కిరీటం ప్రత్యేకతలతో పాటు పోటీకి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈసారి విజేతకు అందించనున్న కిరీటాన్ని 18క్యారెట్ల వైట్ గోల్డ్‌తో రూపొందించారు. ఇందులో ఏకంగా 3,150మెరిసే వజ్రాలను పొదిగారు. ప్రముఖ ఆభరణాల డిజైనర్ జార్జ్ విటెల్స్ (George Wittels),పారిస్‌కు చెందిన ఫైన్ జ్యువెలరీ సంస్థ మేసన్ డి'ఓర్(Maison d'OR) కలిసి దీనిని డిజైన్ చేశారు. ఈ కిరీటానికి 'ది రేడియన్స్ ఆఫ్ యాన్ ఎటర్నల్ లెగసీ' (The Radiance of an Eternal Legacy) అని పేరు పెట్టారు.
వివరాలు
గతం,వర్తమానం,భవిష్యత్తుకు ప్రతీకగా మూడు ప్రధాన వజ్రాలు
ఈ కిరీటంలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. దీని వెనుక భాగంలో '75' అనే సంఖ్యను ప్రత్యేకంగా పొందుపరిచారు.
అలాగే ఇందులోని మూడు ప్రధాన వజ్రాలు మిస్ యూనివర్స్ పోటీల గతం, వర్తమానం, భవిష్యత్తుకు ప్రతీకగా నిలుస్తాయి.
గత ఏడున్నర దశాబ్దాలుగా మహిళల సాధికారతకు, ప్రపంచవ్యాప్తంగా వారు సాధించిన విజయాలకు ఈ కిరీటం నివాళిగా నిలుస్తుందని నిర్వాహకులు వెల్లడించారు.
నవంబర్ 24న జరగనున్న మిస్ యూనివర్స్ గ్రాండ్ ఫినాలేలో ఈ కొత్త కిరీటాన్ని విజేతకు అందించనున్నారు.
ప్రస్తుత మిస్ యూనివర్స్ ఫాతిమా బాష్ (Fatima Bosch) తన వారసురాలికి ఈ కిరీటాన్ని అలంకరించనున్నారు.