Children Mobile Usage: పిల్లల్లో మొబైల్ వినియోగం.. చిన్నారుల మానసిక ఆరోగ్యానికి ముప్పా?
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ వినియోగం అనివార్యమైంది.
అయితే అధికంగా మొబైల్‌ను ఉపయోగించడం మానసిక సమస్యలకు దారితీస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.
భారత్, అమెరికా వంటి దేశాల్లో నిర్వహించిన అధ్యయనాల ప్రకారం, టీనేజ్ చివరి దశలో ఉన్నవారు, యుక్త వయస్సులోని యువత ఎక్కువగా ఈ ప్రభావానికి గురవుతున్నారు.
మెదడు ఆరోగ్యంపై స్మార్ట్‌ఫోన్ ప్రభావం
ఇంటర్నెట్ వినియోగం, మెదడు ఆరోగ్యంపై గ్లోబల్ మైండ్ ప్రాజెక్ట్ నిర్వహించిన అధ్యయనంలో ఆందోళనకరమైన విషయాలు బయటపడ్డాయి.
13 నుంచి 17 ఏళ్ల మధ్య వయస్సున్న 10,475 మంది పై జరిపిన పరిశోధనలో ఒత్తిడి, ఆందోళన వంటి అంశాల ఆధారంగా వివరాలను విశ్లేషించారు
Details
50శాతం మందికి మానసిక ఆరోగ్య సమస్యలు
ఈ అధ్యయనంలో ఆడ పిల్లలు మగ పిల్లల కంటే ఎక్కువగా మానసిక సమస్యలకు గురవుతున్నట్లు తేలింది. ముఖ్యంగా 65% ఆడ పిల్లల్లో మానసిక ఆందోళనలు కనిపిస్తున్నట్లు తేలింది.
13 ఏళ్ల వయస్సులో కనిపించే సమస్యలు 14 ఏళ్లకు మరింత తీవ్రంగా మారి, 15 ఏళ్లకు దారుణ స్థాయికి చేరుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
18-24 సంవత్సరాల వయస్సున్న యువతలో 50శాతం మంది తీవ్ర మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది.
స్మార్ట్‌ఫోన్ బానిసగా మారిన వారిలో మెదడు అభివృద్ధి మందగిస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
2020-2023 మధ్య కరోనా అనంతరం స్మార్ట్‌ఫోన్ వినియోగం గణనీయంగా పెరిగిందని, దానివల్ల యువత మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడిందని అధ్యయనం తెలియజేస్తోంది.
Details
స్మార్ట్‌ఫోన్ వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలు
1. దూషణాత్మక ప్రవర్తన
2. అధిక కోపం, అలకలు
3. ఆందోళనాత్మక ఆలోచనలు
4. వాస్తవికతకు దూరంగా ఉండటం
5. హల్యూసినేషన్స్ (భ్రాంతి దృష్టి) సమస్యలు
6. నిద్రలో అంతరాయం
7. ముఖాముఖి సామాజిక సంబంధాల తగ్గింపు
యువత ఎక్కువగా ఈ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు పరిశోధనలు పేర్కొన్నాయి.
సైబర్ బుల్లీయింగ్, అనుచిత కంటెంట్‌కు గురవడం వంటి అంశాల వల్ల చిన్న వయస్సులోనే పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు.
Details
ఈ సమస్యల నుంచి బయటపడేందుకు సూచనలు
స్మార్ట్‌ఫోన్ వినియోగంలో పరిమితి పెట్టుకోవాలి. దాని ఉపయోగాన్ని అవసరమైనప్పుడు మాత్రమే చేసుకోవాలి. పిల్లల్లో భావోద్వేగ స్థిరత్వాన్ని పెంచేలా ప్రోత్సహించాలి.
స్క్రీన్ టైమ్‌ను తగ్గించడంతో పాటు, టెక్నాలజీ అవగాహన మాత్రమే పెంచాలి.
పిల్లల ప్రవర్తనలో మార్పులను గమనించి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్నారుల సమయాన్ని శారీరక కార్యకలాపాలపై కేంద్రీకరించేలా చేయాలి. నిర్దిష్ట సమయంలో మాత్రమే వినియోగించేలా నియంత్రణ తీసుకురావాలి.
స్మార్ట్‌ఫోన్ ఉపయోగం తక్కువ సమయంలోనే అనేక ప్రయోజనాలు అందించినా, అధికంగా ఉపయోగించడం మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
ముఖ్యంగా యువతలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. కాబట్టి, స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని నియంత్రించి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అత్యంత అవసరం.