
మోనో ఫోబియా: పీరియడ్స్ కి సంబంధించిన భయాలను పోగొట్టుకోవాలంటే చేయాల్సిన పనులు
ఈ వార్తాకథనం ఏంటి
రుతుక్రమం అనేది అందరికీ ఒకేలా ఉండదు. ఈ సమయంలో అసౌకర్యం కచ్చితంగా ఉంటుంది. కానీ అది కొందరిలో తక్కువగా ఉంటే మరికొందరిలో మాత్రం ఎక్కువగా పెరిగి యాంగ్జాయిటీ, ఒత్తిడి కలుగుతాయి.
పీరియడ్స్ గురించి ఎక్కువగా ఒత్తిడికి గురి కావడం, ఆందోళన పెరిగిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని మోనోఫోబియా అంటారు.
ప్రస్తుతం ఈ ఫోబియా గురించి అర్థం చేసుకొని దీనినుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం.
మోనో ఫోబియా ఉన్న వారిలో రుతుక్రమం జరిగినన్ని రోజులు యాంగ్జాయిటీ హై లెవెల్ లో ఉంటుంది.
పీరియడ్స్ గురించి అతిగా ఆలోచించడం, వణకడం, చెమటలు విపరీతంగా పట్టడం, తమ భావోద్వేగాలను కంట్రోల్ లో ఉంచుకోకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Details
మోనో ఫోబియా నుండి బయటపడడానికి మార్గాలు
పీరియడ్స్ గురించి సరైన అవగాహన ఉంటే ఇలాంటి ఫోబియా నుంచి బయటపడవచ్చు. చాలామంది పీరియడ్స్ అంటే ఏదో అంటరాని చర్యగా భావిస్తారు. ముందు ఆ ఆలోచనను వదిలేయాలి.
ఆరోగ్యకరమైన ఆహారం, కావలసినన్ని నీళ్లు తాగడం, రోజుకు 8 గంటల నిద్ర, క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉంటే నెలసరి సమయంలో అనవసర ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతుంది. జీవన శైలిని మార్చుకుంటే మోనోఫోబియా తగ్గిపోతుంది.
ఇంకా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ధ్యానం, యోగ మొదలైనవి చేయడం వల్ల పీరియడ్స్ వల్ల కలిగే యాంగ్జాయిటీ తగ్గిపోతుంది.
మీకు నచ్చిన పనుల్లో నిమగ్నం అవ్వడం, హాబీస్ పెంచుకోవడం, మీకు నచ్చిన వ్యక్తుల సమక్షంలో ఉండడం వల్ల పీరియడ్స్ వల్ల కలిగే యాంగ్జాయిటీ, ఒత్తిడి దూరమైపోతుంది.