
Monsoon fitness: వర్షాకాలంలో వాకింగ్ ఎలా చేయాలో తెలుసుకోండి!
ఈ వార్తాకథనం ఏంటి
వర్షాకాలంలో ఇంటి నుంచి బయటికెళ్లాలంటే కష్టం. ఎండల నుంచి ఉపశమనంతో పాటు వర్షాకాలంలోనూ మనం ఆనందించడానికి చాలా విషయాలుంటాయి. చల్లటి సాయంత్రం వేళ వేడివేడి పకోడిలు తింటే వచ్చే కిక్కే వేరు.
కానీ ఉదయాన్నే వాకింగ్ చేసేవాళ్లకి, పార్కులకి వెళ్లి కాసేపు సరాదా వ్యామాయం చేసే వాళ్లకి ఈ వర్షాల వల్ల ఇబ్బందే.
అలాగనీ ఆరోగ్యాన్ని పక్కన పెట్టలేం కదా. వర్షం కాలంలో రోజుకు 10000 అడుగులు వేసేలా కొన్ని సులువైన మార్గాలున్నాయి.
రోజువారి రోటీన్ లో భాగంగా కొన్ని మార్పులను చేసుకుంటే ఉత్తమం. లిఫ్ట్ బదులుగా మెట్లు ఎక్కడం, ఫోన్ మాట్లాడేటప్పుడు నడవటం, టీవీ చూసేటప్పుడు అటూ ఇటూ అడుగులేస్తే ఎక్కువ అడుగులు వేసే ఆస్కారం ఉంది.
Details
ఈ చిట్కాలను పాటించండి
1 టీవీ చూస్తున్నపుడు కూర్చోకండి
ఇంట్లో నడవడం ఉత్తమమైన మార్గం. మీకిష్టమైన టీవీ షో చూస్తూ నడవండి. లేదా మ్యూజిక్ వింటూ అడుగులు వేయండి.
2. డ్యాన్స్ చేయొచ్చు
ఇంకాస్త మంచి వ్యాయామం కావాలనుకుంటే ఇంట్లో మీకిష్టమైన పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేయొచ్చు.
3. నడవడం
కేవలం ఇంట్లోనే కాకుండా, ఆఫీసులో, ఆపార్ట్‌మెంట్లలో స్థలం ఉంటే నడవడానికి ప్రయత్నించండి.
4. థ్రెడ్ మిల్
స్టేషనరీ బైక్ లేదా థ్రెడ్ మిల్ సదుపాయం ఉంటే ఉపయోగించుకోండి.
5. ఆటలు ఆడటం
ఇంట్లోనే టేబుల్ టెన్నిస్, మిని గోల్ఫ్, లేదా బ్యాడ్మింటన్ లాంటి ఇండూర్ గేమ్స్ అలవాటు చేసుకోండి.
6. ఇంటిపనులు
మెట్లు ఎక్కడం, దిగడం.. ఇల్లు తుడవడం,ఊడవటం లాంటివి మంచి శారీరక వ్యాయమం అందిస్తాయి.