
Mood: నడక, యోగా, ధ్యానంతో మూడ్ రీలీఫ్
ఈ వార్తాకథనం ఏంటి
'మరి అంతగా మహా చింతగా మొహం ముడుచుకోకండి... పనేమ్ తోచక పరేషానుగా కూర్చొనకండి... ఎక్కిళ్లే పెట్టి ఏడుస్తుంటే బాధ తగ్గుతుందా, మరెందుకు వృథా ప్రయత్నం చేయాలి'' — సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలోని పాటలోని మాటలు నిజంగానే జీవితం లో వర్తిస్తాయి. వాస్తవం ఏమిటంటే... ఆఫీసులో బాస్ కంటే కోపం, ఇంట్లో భాగస్వామితో/స్నేహితులతో గొడవల వల్ల మూడ్ పాడు కావడం సహజం. కానీ ఆ బాధలో ఎక్కువగా కూర్చోవడం వల్ల ఏ లాభం లేదు. కాబట్టి, మనసు తేలిక చేయడానికి ఈ తీరులను పాటించవచ్చు
Details
1. నడక
ఏమాత్రం బాధ అనిపించినా, మూడ్ పాడైనా, ఇంటి బయట కొంతసేపు నడక చేయండి. కొత్త గాలి పీల్చడం, యోగా, ధ్యానం ఇలా చేస్తే మనసు తేలిక అవుతుంది. 2.సంగీతం సంగీతం మూడ్‌ను త్వరగా మార్చే శక్తిని కలిగి ఉంది. మీరు ఇష్టపడే పాటలు, హుషారైన మ్యూజిక్ వినడం ద్వారా ఒత్తిడి తగ్గి, శరీరం-మనసుకు ఉత్సాహం వస్తుంది. 3.ప్రకృతి ప్రకృతి మనసుకు శాంతిని అందిస్తుంది. మూడ్ బాగాలేనప్పుడు పార్క్, సరస్సు, సముద్రతీరం వంటి ప్రదేశాలను సందర్శించండి. ప్రకృతి, చల్లని వాతావరణం మనసును మెల్లగా మారుస్తుంది. 4.మాట బాధను పంచుకోవడం వల్ల అది తేలిక అవుతుంది. కుటుంబసభ్యులు,స్నేహితులు లేదా నమ్మకమైన వ్యక్తులతో మాట్లాడి, సమస్యలను బయటపెట్టండి. ఇది భారం తగ్గించడంలో సహాయపడుతుంది.
Details
5. ఆట
పెంపుడు జంతువులు లేదా చిన్న పిల్లలతో ఆడటం ఒత్తిడి, బాధను తగ్గిస్తుంది. ఆ సమయంలో హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి, తద్వారా మనసు సంతోషంతో నింపబడుతుంది 6. రాత మనిషికి బాధలు, సంతోషాలు, గర్వించే సందర్భాలు ఉంటాయి. మనసు నొప్పినప్పుడు, సంతోషకరమైన క్షణాలను గుర్తుంచుకొని, వాటిని పేపర్‌పై రాసి చదవడం వల్ల మనసు కుదుటపడుతుంది. 7. సినిమా/కామెడీ స్కిట్స్ మూడ్ బాగాలేనప్పుడు మంచి కామెడీ సినిమా లేదా స్కిట్ చూడడం ద్వారా నవ్వులు విడుదల అవుతాయి, బాధను మరిచిపోవడంలో సహాయపడతాయి. 8. పని ఒత్తిడిలో ఉంటే, రోజువారీ పనులు చేయడం అలసిపోవచ్చు. కొత్తగా వంట, గార్డెనింగ్, ఇల్లు సర్దడం, డెకరేషన్ వంటి పనులు చేయడం ద్వారా మూడ్ మార్చవచ్చు.
Details
9. విహారయాత్ర
సమయం ఉంటే ఒంటరిగా లేదా స్నేహితులతో చిన్న ట్రిప్ ప్లాన్ చేయండి. కొత్త ప్రదేశాలను చూడడం ద్వారా మనసు హుషారెక్కి బాధలు మరిచిపోతాయి. 10. కౌన్సెలింగ్ ఏం చేసినా బాధలు తగ్గకపోతే మానసిక నిపుణులను సంప్రదించండి. వారు సమస్యలను ఓపికగా విని, కౌన్సెలింగ్ లేదా అవసరమైతే చికిత్స అందిస్తారు. ఈ సులభమైన పద్ధతులను పాటించడం ద్వారా మూడ్ పాడు, ఒత్తిడి, బాధల నుండి బయట పడవచ్చు.