
Mother's Day: మదర్స్ డే స్పెషల్.. తక్కువ ఖర్చుతో తల్లికి ఇచ్చే అద్భుత గిఫ్ట్‌లు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతేడాది మే రెండో ఆదివారం మదర్స్ డే జరుపుకుంటాం. ఈసారి మే 11న ఈ ప్రత్యేక దినాన్ని సెలబ్రేట్ చేయబోతున్నాం.
తల్లి ప్రేమ, త్యాగానికి గుర్తుగా మదర్స్ డే అనేది ప్రతి బిడ్డకు భావోద్వేగాలతో నిండిన రోజు. తల్లికి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు పిల్లలు ప్రత్యేకమైన గిఫ్ట్స్ ప్లాన్ చేస్తుంటారు.
మీ అమ్మ కోసం ఈసారి మేము సిఫార్సు చేసే గిఫ్ట్ ఐడియాలు ఇవే:
1. కస్టమైజ్డ్ గిఫ్ట్స్
తల్లిని ప్రత్యేకంగా భావింపజేయాలంటే కస్టమైజ్డ్ గిఫ్ట్స్ ఉత్తమం. ఫోటో ఫ్రేమ్స్, ల్యాంప్స్, పేరుతో కూడిన గిఫ్ట్‌లు వంటివి ఆన్‌లైన్‌లో సులభంగా ఆర్డర్ చేయొచ్చు.
Details
2. ఫేవరెట్ ప్లేస్‌కు ట్రిప్
తల్లి ఇష్టపడే ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేయండి. సర్‌ప్రైజ్ ట్రిప్‌గా చేస్తే మరింత ఆనందం కలుగుతుంది. ఇది ఆమెకు ఒక మంచి విశ్రాంతి అవుతుంది.
3. మొబైల్ హోల్డర్ పర్స్
ఫోన్‌ను సురక్షితంగా ఉంచేందుకు మల్టీపర్పస్ మొబైల్ హోల్డర్ పర్స్ బహుమతిగా ఇవ్వొచ్చు. ఇది అందముగా ఉండటంతోపాటు ఉపయోగకరంగా ఉంటుంది.
4. సినిమానైట్ ప్లాన్
తల్లి ఇష్టపడే సినిమా థియేటర్లో చూసేందుకు టికెట్లు బుక్ చేయండి లేదా ఇంట్లోనే సినిమా సెట్ చేసి ఆమె ఇష్టమైన స్నాక్స్‌తో సరదాగా గడపండి.
Details
5. పట్టుచీర గిఫ్ట్
పట్టుచీరలంటే తల్లులకు ప్రత్యేకమైన ఇష్టం. ఆమెకు ఇష్టమైన రంగులో, నాణ్యమైన పట్టుచీరను బహుమతిగా ఇవ్వండి.
6. బ్రాండెడ్ కాస్మోటిక్స్
లిప్‌స్టిక్, క్రీమ్‌లు, ఐలైనర్ లాంటి హైక్వాలిటీ కాస్మోటిక్స్ అమ్మకు మంచి ఆనందం కలిగిస్తాయి. ఆమె ఉపయోగించే బ్రాండ్‌కు అనుగుణంగా సెలెక్ట్ చేయండి.
7. ఇష్టమైన ఆహారం
ఈ మదర్స్ డే రోజున తల్లికి వంటగదికి సెలవిచ్చి, ఆమెకు ఇష్టమైన వంటకం మీరే చేసి వడ్డించండి. పిల్లలు వండిన భోజనం తల్లి మనసును ఆనందంగా నింపుతుంది.
ఈ మదర్స్ డే మీ ప్రేమను మాటల్లో కాదు, పనిలో చూపించండి. మీరు ఎంచుకునే చిన్న కానుకే తల్లి కోసం ఒక మధురమైన జ్ఞాపకంగా మిగులుతుంది.