NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / లైఫ్-స్టైల్ వార్తలు / ప్రేరణ: నువ్వు చేసిన మంచి, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది
    తదుపరి వార్తా కథనం
    ప్రేరణ: నువ్వు చేసిన మంచి, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది
    ఇతరులకు మంచి చేస్తే నీక్కూడా మంచి జరుగుతుంది

    ప్రేరణ: నువ్వు చేసిన మంచి, మళ్ళీ నీ దగ్గరికి తిరిగి వస్తుంది

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 05, 2023
    04:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వార్థం లేకుండా అవతలి వారికి మంచి చేసినపుడు అదెలా అయినా మళ్ళీ మీ దగ్గరకు వస్తుంది. అందుకే వీలైనంత మటుకు అవతలి వారికి చెడు చేయకుండా ఉండండి.

    మీకు వీలైతే ఖచ్చితంగా మంచి చేయండి. దీనికోసం మీరు పెద్దగా డబ్బులు ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదు. చాలామంది ఇదే తప్పు చేస్తారు. ప్రతీదాన్ని డబ్బుతోనే చూస్తారు.

    కానీ మంచి చేయడానికి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు. ఎవరో తెలియని వాళ్ళు మీ ఊరికి వచ్చి, ఎవరిదైనా అడ్రెస్ అడిగారనుకుందాం. వారికి అడ్రెస్ చెప్పి, వీలైతే వాళ్ళని ఆ అడ్రెస్ లో ఉన్న ఇంటికి చేరవేయడం కూడా మంచిపనే.

    కొందరు ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా చేయరు.

    ప్రేరణ

    నువ్వేది ఇస్తే నీకదే దొరుకుతుంది

    అవతలి వారికి మంచి చేసే టైమ్ లేదని కొంతమంది భావిస్తారు. ఇలాంటి వాళ్లే తమకు ఏదైనా సాయం కావాల్సిన వచ్చినపుడు ఎవ్వరూ రాకపోతే, ఈ మనుషుల్లో మంచితనం చచ్చిపోయిందని అంటారు.

    తామెప్పుడూ అవతలి వారికి మంచి చేయలేదన్న వాస్తవాన్ని గుర్తించరు. కనీసం ఆ ఆలోచన కూడా వారికి రాదు.

    నువ్వు ఎవ్వరికి మంచి చేయకుండా నీకు మంచి జరగడం లేదని ఎలా బాధపడతావ్? అందుకే నువ్వు మంచి చేయాలి. ఈ ప్రపంచానికి నువ్వేది ఇస్తే అదే నీకు తిరిగి వస్తుంది.

    అందుకే వీలైనంత మటుకు మంచి చేస్తూ ఉండండి. మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి మీరు చేసే చిన్న మంచిపని కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే మరో మంచిపనికి దారితీయవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రేరణ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ప్రేరణ

    మీకు స్వార్థం ఉందా? ఎలాంటి విషయాల్లో స్వార్థం మంచిదో తెలుసుకోండి నిద్రలేమి
    ప్రేరణ: అడుగు వేస్తేనే దారి, నడక సాగితేనే విజయం లైఫ్-స్టైల్
    ప్రేరణ: సాధించాలన్న సంకల్పం ఉంటే విశ్వం కూడా సాయం చేస్తుంది లైఫ్-స్టైల్
    ప్రేరణ: ప్రయత్నిస్తే పదిరోజుల్లో రాని విజయం వందరోజుల్లో వచ్చే అవకాశం లైఫ్-స్టైల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025