ప్రేరణ: ఏమీ రాదనుకోవడం కన్నా పిచ్చితనం, అన్నీ తెలుసనుకోవడం కన్నా మూర్ఖత్వం మరోటి లేదు
ఈ వార్తాకథనం ఏంటి
తాను చేస్తున్న పనిలో ఓటమి ఎదురైనపుడు తనకేమీ రాదనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనవల్ల ఏదీ చేతకాదనీ, తనొక శుద్ధ వేస్టనీ తనను తాను నిందించుకుంటారు. అవసరమైతే దండించుకుంటారు.
అయితే ఇలా అనుకునే వారికి రివర్స్ లో తనకు అన్నీ తెలుసనీ, ఎదుటివారికి ఏదీ తెలియదనీ, తాము చెప్పిందే కరెక్టనీ కొంతమంది అనుకుంటారు. ఇలాంటి వాళ్ళు ఏదైనా పనిలో ఫెయిలైతే తప్పు తమది కాదని, ఫెయిల్ చేసిన వాళ్ళదని చెబుతారు.
ఈ రెండూ తప్పే. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రతీ పనిలో పర్ఫెక్ట్ కాదు. ఏ ఒక్క మనిషికి కూడా అంతా తెలియదు. అలాగే ఈ భూమ్మీద పుట్టిన ప్రతీ మనిషిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది.
Details
యూట్యూబ్ వీడియో చూస్తే ఈత రాదు
ఒక వ్యక్తికి చదువు అస్సలు రాదు, కానీ అతడికి సింగింగ్ లో మంచి టాలెంట్ ఉండవచ్చు. చదువు రావట్లేదు కదా అని తనను తాను చేతకాని వాడినని ముద్ర వేసుకుంటే ఈ ప్రపంచం మంచి సింగర్ ని కోల్పోతుంది.
అలాగే తనకే అంతా తెలుసనుకునే వాడితో ప్రాబ్లమ్ ఏంటంటే, ఎదుటివాళ్ళు చెప్పేది వాడు వినడు. దానివల్ల అతడు నష్టపోతాడు. ముందే చెప్పినట్టు ఏ మనిషి కూడా ప్రతీ రంగంలో పర్ఫెక్ట్ కాదు.
రెగ్యులర్ గా ట్రేడింగ్ చేసే వాడు తనకు అంతా తెలుసనుకుని యూట్యూబ్ వీడియో చూసి ఈత రాకపోయినా చెరువులో దూకితే మునిగిపోతాడు తప్ప పైకి తేలడు.
అందుకే ఏదీ రాదనుకోవడం ఎంత తప్పో, అంతా తెలుసనుకోవడం కూడా అంతే తప్పు.