ప్రేరణ: టాలెంట్ ఉండి కృషి చేయలేని వాడు, టాలెంట్ లేని కృషి చేసే వాడి చేతిలో ఓడిపోతాడు
ఈ వార్తాకథనం ఏంటి
కొందరికి పుట్టుకతోనే మంచి తెలివి ఉంటుంది. మనుషుల్ని, పరిస్థితులను ఈజీగా అర్థం చేసుకుంటారు. ఏ పనైనా ఈజీగా నేర్చుకుంటారు.
వాళ్ళని చూస్తుంటే అలాంటి టాలెంట్ నాకు ఉండి ఉంటేనా అని ప్రతీ ఒక్కరూ తమలో తాము అనుకుంటారు.
అలా టాలెంట్ ఉన్నవాళ్ళని చూసి మీరు కుళ్ళుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీరు వాళ్ళని ఓడించవచ్చు.
అదెలా? నాకు అంత టాలెంట్ లేదు కదా అని మీరనుకోవచ్చు. టాలెంట్ లేనివాళ్ళ దగ్గర కృషి చేసే పట్టుదల ఉండాలి. అదుంటే ఎంతటి టాలెంట్ ఉన్నవారినయినా ఈజీగా ఓడించవచ్చు.
అందుకే ఒక పనిలో నాకంత నైపుణ్యం లేదు, నేను నెగ్గుకు రాగలనా అని ఆలోచించకండి. నెగ్గుకు వచ్చేలా కష్టపడండి.
Details
తవ్వుకుంటూ పోతే నీళ్ళు ఊరినట్టే, కృషి చేస్తే టాలెంట్ పెరుగుతూ పోతుంది
నీవు చేసే కృషి నిన్ను ఖచ్చితంగా ఉన్నత స్థాయికి తీసుకెళుతుంది. అప్పుడు నిన్ను చూసి నీవే ఆశ్చర్యపోతుంటావు. ఇదెలా సాధ్యమయ్యిందని నిన్ను నువ్వు ప్రశ్న వేసుకుంటావు.
అవతలి వారికి నీకంటే ఎక్కువ నైపుణ్యం ఉంది కదా, వాళ్ళెందుకు సక్సెస్ కాలేకపోయారని ఆలోచిస్తుంటావ్?
అప్పుడు నీకర్థం కావాల్సింది ఏంటంటే, జీవితంలో గెలవడానికి, అనుకున్నది సాధించడానికి అంతులేని టాలెంట్ ఉండాల్సిన పనిలేదు. అంతులేని కృషి కావాలి.
ఒక బావిని తవ్వుతూ వెళ్తే నీళ్ళెలా ఊరుతాయో, నువ్వు పనిచేస్తూ వెళ్తే నీలో టాలెంట్ అలా పెరుగుతూ వస్తుంది.
ఈ విషయం నువ్వు గుర్తుంచుకుంటే నీకంటే ఎక్కువ టాలెంట్ ఉన్నవారిని చూసి ఈర్ష్య పడవు. నాకెందుకు అలా లేదని బాధపడవు. పనిచేయడం ప్రారంభిస్తావు.