
ప్రేరణ: పట్టుదలతో పనిచేస్తే పర్వతం కూడా పాదాల కిందకు వస్తుంది
ఈ వార్తాకథనం ఏంటి
పట్టు పట్టరాదు, పట్టి విడువ రాదు అని ఒక తెలుగు పద్యం ఉంటుంది. చేసే పనిలో ఓడిపోతామేమోనన్న భయం, ఆ పనిని పూర్తి చేయనీకుండా ఆపేస్తుంది.
అంటే పట్టుదలను కోల్పోతాము. విజేతలకు పరాజితులకు తేడా అక్కడే ఉంది. ఓటమి అంచున ఉన్నా కూడా గెలిచే అవకాశం ఇంకా ఉందని విజేత అనుకుంటాడు.
ఓడిపోయే అవకాశం వస్తుందని తాను అనుకున్నప్పుడే పరాజితుడు అక్కడి నుండి పారిపోతాడు. ఇలాంటి లక్షణం ఉన్నవాళ్ళు ఏ రంగంలోనూ గెలుపొందలేరు.
ఒకరంగంలో పనిచేస్తున్నప్పుడు ఆ రంగంలో పూర్తిగా మునిగిపోయే స్థితి ఒక్కసారైనా వస్తుంది. అలా వచ్చిన ప్రతీసారీ తప్పించుకునే వాడికి విజయం ఎప్పటికీ అందని ద్రాక్షలానే మిగిలిపోతుంది.
Details
శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకుంటేనే పట్టుదల సాధ్యం
ఏ పని చేయాలన్నా పట్టుదల చాలా ముఖ్యం. ఏ పనిలోనైనా సవాళ్ళు ఎదురవుతుంటాయి. అవొచ్చినపుడే నీలోని సమర్థత బయటపడుతుంది. పారిపోయినపుడు నీలో అసమర్థత అందరికీ అర్థమవుతుంది.
పట్టుదలతో పనిచేసేవాడికి ఎప్పటికైనా విజయం దక్కుతుంది. ఎవరెస్ట్ ఎక్కాలనే సంకల్పం ఉన్నవాడు మధ్యలో ఆగిపోతే కనీసం కిందకు దిగే శక్తి కూడా ఉండదు.
పట్టుదలతో పైకి నడిస్తేనే శిఖరం మీదకు చేరుకోగలం. అప్పుడు పర్వతం నీ పాదాల కింద ఉంటుంది.
ఏ విషయంలోనైనా పట్టుదలగా పనిచేయాలంటే మానసికంగా మెరుగ్గా ఉండాలి. వ్యసనాలు ఉండకూడదు. మనసును, శరీరాన్ని అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే ఒక పనిని పట్టుదలతో చేయగలరు.